Heart care : చిన్న పనులకే అలసిపోతున్నారా..? అయితే మీ గుండె జాగ్రత్త..!
సాక్షి లైఫ్ : మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వస్తుందా? ఉదయం పూట వాకింగ్ చేయలేకపోతున్నారా..? మార్కెట్‌కు వెళ్లి రాగానే తీవ్రమైన అలసటగా అనిపిస్తోందా? చాలామంది ఈ లక్షణాలను వయసు పైబడటం వల్ల వచ్చే సహజమైన మార్పులుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ముఖ్యంగా 45 ఏళ్లు దాటిన తర్వాత శారీరక సామర్థ్యం క్రమంగా తగ్గడం అనేది గుండె కవాటాల (Heart Valves) సమస్యలకు ముందస్తు సంకేతం కావొచ్చు. ఈ తరహా సమస్యలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
'యాక్టివిటీ ఆడిట్' తప్పనిసరి..
45 ఏళ్లు పైబడిన వారు తమ శారీరక సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవడాన్ని వైద్యులు 'యాక్టివిటీ ఆడిట్' (Activity Audit) అంటారు. అంటే, కొన్ని ఏళ్ల క్రితం మీరు ఎంత చురుకుగా పనులు చేసేవారో, ఇప్పుడు కూడా అంతే సులభంగా చేయగలుగుతున్నారా లేదా అనేది గమనించాలి. కేవలం ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తేనే కాకుండా, రోజువారీ పనుల్లో మునుపటి చురుకుదనం లోపించినా.. వెంటనే అప్రమత్తం కావాలి.
గుండె కవాటాల సమస్య అంటే ఏమిటి..?
మన గుండెలో నాలుగు వాల్వ్‌లు ఉంటాయి. ఇవి రక్తం సరైన దిశలో ప్రవహించేలా, వెనక్కి రాకుండా అడ్డుకునేలా పనిచేస్తాయి. ఈ కవాటాలలో ఏదైనా లోపం తలెత్తితే దానిని 'హార్ట్ వాల్వ్ డిసీజ్' (Heart Valve Disease) అంటారు. చాలాసార్లు ఈ సమస్య నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి, దాని తీవ్రతను మనం త్వరగా పసిగట్టలేము.
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు..
కొద్దిదూరం నడిచినా, మెట్లు ఎక్కినా లేదా చిన్నపాటి శారీరక శ్రమ చేసినా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలగడం. ఎక్కువ పని చేయకపోయినా విపరీతమైన నీరసం ఆవహించడం, దైనందిన పనుల్లో శక్తి లోపించినట్లు అనిపించడం. అకస్మాత్తుగా తల తిరిగినట్లు లేదా శరీర సమతుల్యత తప్పుతున్నట్లు అనిపించడం.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
పాదాలు, చీలమండల వద్ద నీరు చేరి వాపులు రావడం. గుండె చాలా వేగంగా లేదా అసాధారణంగా కొట్టుకోవడం.. వంటి లక్షణాలు కనిపిస్తే కంగారు పడకుండా వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి. కవాటాల పనితీరును తెలుసుకోవడానికి డాక్టర్ సలహా మేరకు 2D ఎకోకార్డియోగ్రఫీ (2D Echocardiography) పరీక్ష చేయించుకోవాలి. ఆహారంలో ఉప్పు వాడకం బాగా తగ్గించాలి. నూనె, కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్, వేపుళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. సొంత వైద్యం కూడదు, మధ్యలో మందులు ఆపేయకూడదు. డాక్టర్ సలహా మేరకు ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు, వాకింగ్ లాంటివి చేయాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బులను ప్రాథమిక దశలోనే నివారించవచ్చు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
