Pollution Effect : వాయు కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను రక్షించే అద్భుత ఆహారాలు..
సాక్షి లైఫ్ : పల్లె, పట్నం అనే తేడాల్లేకుండా నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యం (Air Pollution) మన ఆరోగ్యానికి, ముఖ్యంగా ఊపిరితిత్తులకు తీవ్ర ముప్పుగా మారుతోంది. గాలిలోని దుమ్ము, పొగ, సూక్ష్మ కణాలు (PM2.5, PM10) శ్వాస ద్వారా లోపలికి వెళ్లి ఊపిరితిత్తుల (Lungs) పనితీరును దెబ్బతీస్తాయి. పిల్లలు, వృద్ధులు, ఉబ్బసం (Asthma) వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. కాలుష్యం బారి నుంచి కాపాడుకోవడానికి కేవలం మాస్క్‌లు ధరించడం, ఇంట్లోనే ఉండటం మాత్రమే సరిపోదు.. తీసుకునే ఆహారం పట్ల కూడా శ్రద్ధ వహించాలి.
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
కాలుష్యం ఊపిరితిత్తులను ఎలా దెబ్బతీస్తుంది..?
గాలిలోని ప్రమాదకర కణాలు లోపలికి వెళ్లడం వల్ల.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. గొంతు మంట, ఎడతెగని దగ్గు బాధిస్తాయి. ఆస్తమా రోగుల్లో ఈ సమస్య మరింత ఉద్ధృతం అవుతుంది. ఊపిరితిత్తుల్లో వాపు రావడం, దీర్ఘకాలంలో వాటి సామర్థ్యం తగ్గిపోవడం జరుగుతుంది.
డైట్లో చేర్చుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు..
శరీరాన్ని కాలుష్య ప్రభావం (oxidative stress) నుంచి రక్షించుకోవడానికి ఈ 5 ఆహారాలను రోజూవారీ డైట్లో చేర్చుకోవాలి. ఉసిరి (Amla).. ఉసిరికాయలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలుష్యం వల్ల శరీరంలో ఏర్పడే ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడి ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తాయి. అల్లం (Ginger)..అల్లంలోని 'జింజరాల్' అనే సమ్మేళనం అద్భుతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లం టీ, సూప్ లేదా కూరల్లో దీన్ని వాడటం వల్ల శ్వాసనాళాలు శుభ్రపడతాయి.
పసుపు (Turmeric)..పసుపులోని 'కర్కుమిన్' ఔషధాల గని. ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, ఊపిరితిత్తుల్లో వాపును, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం మంచిది. ఆకుకూరలు (Green leafy vegetables)..పాలకూర, బ్రొకోలి లాంటి ఆకుపచ్చని కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
సిట్రస్ పండ్లు (Citrus Fruits).. నారింజ, బత్తాయి, నిమ్మకాయ లాంటి పుల్లటి పండ్లలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇవి వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులకు జరిగే నష్టాన్ని నివారించడంలో కీలకంగా పనిచేస్తాయి.
ఊపిరితిత్తుల రక్షణకు పాటించాల్సిన జాగ్రత్తలు..
AQI గమనించండి..బయటకు వెళ్లే ముందు మీ ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (Air Quality Index) ఎలా ఉందో చెక్ చేసుకోండి. మాస్క్ తప్పనిసరి.. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే కచ్చితంగా ముఖానికి సరిగ్గా సరిపోయే 'N95 మాస్క్' మాత్రమే ధరించండి.మార్నింగ్ వాక్ వద్దు..ఉదయం పూట పొగమంచుతో పాటు కాలుష్యం కూడా అట్టడుగు పొరల్లోనే ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో ఆరుబయట వాకింగ్, వ్యాయామాలు మానుకోవాలి.
ఇంటి వాతావరణం.. ఇంట్లోకి దుమ్ము రాకుండా చూసుకోవాలి. అవసరమైతే నాణ్యమైన 'ఎయిర్ ప్యూరిఫైయర్స్' వాడుకోవచ్చు. నీళ్లు బాగా తాగాలి.. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఎప్పటికప్పుడు తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. పొగ తాగొద్దు..సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులకు పూర్తిగా దూరంగా ఉండాలి. పక్కవారు తాగే పొగ (passive smoking) పీల్చినా ప్రమాదమే. విపరీతమైన దగ్గు, ఆయాసం, ఛాతిలో పట్టేసినట్లు ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
