గ్రీన్ గ్రేప్స్ vs బ్లాక్ గ్రేప్స్.. ఆరోగ్యానికి ఏవి ఎక్కువ ప్రయోజనకరం..?

షేర్ చేయండి:
గ్రీన్ గ్రేప్స్ vs బ్లాక్ గ్రేప్స్.. ఆరోగ్యానికి ఏవి ఎక్కువ ప్రయోజనకరం..?

సాక్షి లైఫ్ : ద్రాక్ష అనేది రుచికరమైన పండు మాత్రమే కాదు, పోషకాలకు నిలయం కూడా. మార్కెట్లో నల్ల ద్రాక్ష, ఆకుపచ్చ ద్రాక్ష రెండురకాలు అందుబాటులో ఉంటాయి. కానీ తరచుగా ప్రజల మనస్సులలో ఈ ప్రశ్న తలెత్తుతుంది, ఈ రెండు ద్రాక్షలలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరం ? అనేది ఇప్పడు తెలుసుకుందాం..


పచ్చ ద్రాక్ష vs నల్ల ద్రాక్ష:  

 మీరు మార్కెట్లో నల్ల, ఆకుపచ్చ ద్రాక్షలను చూసే ఉంటారు. రెండు రంగుల ద్రాక్షలు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా రెండూ మేలు చేస్తాయి, కానీ ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉందని మీకు తెలుసా?

నల్ల ద్రాక్షలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. వాటిలో ఆంథోసైనిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా ఉంటుంది, ఇది అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.

ఆకుపచ్చ ద్రాక్షలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించ డానికి, బరువు తగ్గించడానికి, కంటి చూపును మెరుగు పరచడంలో సహాయపడతాయి.  

ఆకుపచ్చ ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పడం పూర్తిగా సరైనది కాదు. రెండు ద్రాక్షలు వేటికవే ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అయితే ఆకుపచ్చ ద్రాక్ష బరువు తగ్గడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మంచిదని భావిస్తారు. నల్ల ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ,క్యాన్సర్‌ను నివారించడానికి ఉపకరిస్తాయి. 

 

ఇది కూడా చదవండి..విటమిన్ బి12 లోపం వల్ల అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ఏమి చేయాలి..? 

ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.