Oral health care : చిగుళ్ల వ్యాధి పళ్లకు 'నిశ్శబ్ద హంతకి'.. చిగుళ్ల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

షేర్ చేయండి:
Oral health care : చిగుళ్ల వ్యాధి పళ్లకు 'నిశ్శబ్ద హంతకి'.. చిగుళ్ల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

సాక్షి లైఫ్ : చాలామంది పళ్లు తెల్లగా ఉంటే చాలు, నోరు ఆరోగ్యంగా ఉన్నట్లే అని భావిస్తారు. కానీ, పళ్లకు పట్టునిచ్చే చిగుళ్ల ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటారు. చిగుళ్ల వ్యాధి అనేది ఒక 'నిశ్శబ్ద హంతకుడు'. పళ్లు ఊడిపోయే స్థాయికి చేరే వరకు దీని లక్షణాలు బయటపడవని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిగుళ్ల ఆరోగ్యం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

 

చిగుళ్ల వ్యాధిలో ప్రధానంగా రెండు దశలుంటాయి.. 

జింజివైటిస్ (Gingivitis)..

ఇది ప్రారంభ దశ. ఇందులో చిగుళ్లు ఎర్రబడటం, వాపు రావడం జరుగుతుంది. ఇది నయం చేయగల స్థితి.

పీరియాడోంటైటిస్ (Periodontitis)..

ఇది తీవ్రమైన స్థితి. వాపు చిగుళ్ల నుంచి ఎముకలకు వ్యాపిస్తుంది. దీనివల్ల పంటికి, ఎముకకు మధ్య ఉండే స్నాయువులు దెబ్బతిని, చివరికి పళ్లు కదిలి ఊడిపోతాయి.

గుర్తించాల్సిన సంకేతాలు..? 

చిగుళ్ల వ్యాధిలో నొప్పి ఉండదు, అందుకే చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈ కింది లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి.  పళ్లు తోముతున్నప్పుడు లేదా పళ్ల మధ్య శుభ్రం చేస్తున్నప్పుడు రక్తం రావడం వాపునకు ప్రధాన సంకేతం. ఆరోగ్యకరమైన చిగుళ్లు లేత గులాబీ రంగులో ఉంటాయి. అవి ఎర్రగా లేదా ముదురు రంగులోకి మారితే వ్యాధి ఉన్నట్లే. నోటి నుంచి నిరంతరం దుర్వాసన రావడం. పంటి మెడ భాగంలో సున్నితత్వం పెరగడం.

 
చిగుళ్లను రక్షించడంలో కేవలం బ్రష్ మాత్రమే చేస్తే సరిపోదు. దంతవైద్యనిపుణుల సూచనల ప్రకారం ఇవి పాటించాలి. మనం వాడే డెంటల్ ఫ్లాస్  కంటే 'ఇంటర్‌డెంటల్ బ్రష్‌లు' చిగుళ్ల సందులను శుభ్రం చేయడంలో అత్యంత ప్రభావవంతమైనవని పరిశోధనలు చెబుతున్నాయి.

ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్..

మాన్యువల్ బ్రష్ కంటే 'ఆసిలేషన్-రొటేషన్' టెక్నాలజీ ఉన్న ఎలక్ట్రిక్ బ్రష్‌లు బ్యాక్టీరియాను సమర్థవంతంగా తొలగిస్తాయి. ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి డెంటల్ క్లీనింగ్ (Scaling) చేయించుకోవడం వల్ల చిగుళ్ల వ్యాధిని నివారించవచ్చు.

ధూమపానం.. 

ధూమపానం చేసేవారిలో చిగుళ్ల వ్యాధి ఉన్నప్పటికీ రక్తస్రావం కనిపించదు. పొగతాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి, వాపు ఉన్నప్పటికీ బయటకు తెలియదు. దీనివల్ల వ్యాధి లోపల ముదురుతున్నా రోగికి తెలియకుండా పోతుంది. అందుకే ధూమపానం చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

 ఆరోగ్యకరమైన చిగుళ్ల నుండి అస్సలు రక్తం రాదు. ఒకవేళ బ్రష్ చేసినప్పుడు రక్తం వస్తుంటే, అది చిగుళ్లు అనారోగ్యంగా ఉన్నాయని చెప్పడానికి శరీరం ఇస్తున్న హెచ్చరిక. 7 నుంచి 14 రోజులకు మించి రక్తస్రావం కొనసాగితే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలి" అని డెంటిస్టులు సూచిస్తున్నారు. పళ్లు ఊడిపోయిన తర్వాత బాధపడటం కంటే, చిగుళ్లను కాపాడుకోవడం సులభం, తక్కువ ఖర్చుతో కూడుకున్న పని.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com