Monsoon Skincare Tips : వానాకాలంలో చర్మం పాడవకుండా ఉండేందుకు సరైన చిట్కాలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలపు చల్లని వాతావరణం మనసుకు ఎంతో హాయినిస్తుంది. కానీ, చర్మానికి మాత్రం ఇది ఎన్నో సవాళ్లను విసురుతుంది. గాలిలో తేమ, ఉక్కపోత, చెమట కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెంది మొటిమలు, దద్దుర్లు, జిడ్డు చర్మం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ కాలంలో మనం చర్మ సంరక్షణ విషయంలో తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. మరి ఆ పొరపాట్లేమిటి..? ఆరోగ్యవంతమైన, కాంతివంతమైన చర్మం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా..? వెంటనే సరిదిద్దుకోండి..!

1. ముఖాన్ని పదే పదే కడగడం.. 

జిడ్డు పోగొట్టుకోవడానికి చాలామంది పదే పదే ముఖం కడుక్కుంటుంటారు. ఇది మంచికంటే చెడు ఎక్కువ చేస్తుంది. దీనివల్ల చర్మంలోని సహజ నూనెలు, తేమ నశించి చర్మం పూర్తిగా పొడిబారుతుంది. ఆ కొరతను తీర్చడానికి చర్మం మరింత జిడ్డును ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి రోజుకు రెండు, మూడు సార్లు మృదువైన ఫేస్‌వాష్‌తో ముఖం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

2. మాయిశ్చరైజర్ రాయకపోవడం.. 


వాతావరణంలో అప్పటికే తేమ ఉందని భావించి చాలామంది మాయిశ్చరైజర్ వాడటం మానేస్తారు. కానీ చర్మానికి ప్రతి కాలంలోనూ తేమ అవసరం. వర్షాకాలంలో మీ చర్మ తత్వానికి సరిపోయే, జిడ్డు లేని (Non-greasy or lightweight) మాయిశ్చరైజర్‌ను తప్పనిసరిగా రాసుకోవాలి.

3. సన్‌స్క్రీన్ లోషన్ విస్మరించడం.. 

మబ్బులు పట్టి ఉన్నాయని, ఎండ లేదని సన్‌స్క్రీన్ లోషన్ రాయకపోవడం అతిపెద్ద పొరపాటు. మబ్బుల చాటు నుంచి కూడా సూర్యుని అతినీలలోహిత (UV) కిరణాలు చర్మాన్ని చేరుకుంటాయి. కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు సన్‌స్క్రీన్ వాడటం ఏమాత్రం మర్చిపోవద్దు.

4. చర్మాన్ని ఎక్కువసేపు తడిగా ఉంచడం..

వానలో తడిసి ఇంటికి రాగానే అలాగే ఉండిపోకండి. వెంటనే శుభ్రమైన, పొడి టవల్‌తో ముఖాన్ని, శరీరాన్ని మృదువుగా అద్దుతూ తుడుచుకోవాలి. చర్మం ఎక్కువసేపు తడిగా ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది.

5. శుభ్రత లేని టవల్స్, మేకప్ బ్రష్‌ల వాడకం.. 

వర్షాకాలంలో మురికిగా ఉండే టవల్స్, మేకప్ బ్రష్‌లు లేదా స్పాంజ్‌లను వాడటం వల్ల చర్మంపైకి బ్యాక్టీరియా సులభంగా చేరుతుంది. దీనివల్ల మొటిమలు, చర్మ వ్యాధులు వస్తాయి. కాబట్టి ముఖం తుడుచుకునే టవల్స్‌ను, మేకప్ సాధనాలను ఎప్పటికప్పుడు వేడినీటితో శుభ్రం చేసుకోవాలి.

6. నీళ్లు తక్కువగా తాగడం.. 

చలికి దాహం వేయకపోవడంతో సహజంగానే నీళ్లు తాగడం తగ్గిస్తాం. కానీ శరీరానికి నీటి అవసరం ఎప్పుడూ ఉంటుంది. తగినన్ని నీళ్లు తాగడం వల్ల చర్మం లోపలి నుంచి హైడ్రేట్ అయ్యి, ముఖం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

7. మేకప్ తీసేయకుండానే నిద్రపోవడం.. 

రోజంతా వేసుకున్న మేకప్‌ను రాత్రి పడుకునే ముందు తొలగించకపోవడం చర్మానికి ఎంతో హానికరం. చర్మంపై పేరుకున్న మురికి, మేకప్ వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి ఉదయం నిద్రలేచేసరికి మొటిమలు దర్శనమిస్తాయి. అందుకే నిద్రపోయే ముందు కచ్చితంగా డబుల్ క్లెన్సింగ్ విధానంలో మేకప్ తొలగించి, ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.