మష్రూమ్స్ తో హెల్త్ బెనిఫిట్స్ ఇవే.. 

షేర్ చేయండి:
మష్రూమ్స్ తో హెల్త్ బెనిఫిట్స్ ఇవే.. 

సాక్షి లైఫ్ : పుట్టగొడుగులతో తయారుచేసిన కూరలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇవి అంటే అందరూ చాలా ఇష్టపడుతుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుట్టగొడుగులు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాదు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. మష్రూమ్స్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో..ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి.. న్యూ రీసెర్చ్ : కృత్రిమ మానవ యాంటీబాడీస్ తో పాము విషాన్ని తొలగించవచ్చు.. 

పుట్టగొడుగులు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. వీటిని డైరెక్ట్ గా టనలేం.. కాబట్టి వీటితో పలురకాల వంటకాలు తయారుచేసుకుని  తింటారు. వీటిని తినడం ద్వారా అనేక హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.  

పుట్టగొడుగులు బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గి, గుడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. కొంతమంది వీటితో కధాయ్ మష్రూమ్స్ కర్రీ, మష్రూమ్ కబాబ్స్ తయారు చేసుకుని ఆరగిస్తుంటారు. 
 
పుట్టగొడుగుల్లో చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పుట్టగొడుగులను తినడం ద్వారా "డి" విటమిన్ ను పొందవచ్చు. చలికాలంలో మష్రూమ్స్ తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. పుట్టగొడుగుల్లో ఉండే పోషకాలు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యేన్సర్ రిస్క్ ను కూడా తగ్గిస్తాయి. 

ఇది కూడా చదవండి.. వేసవి కాలంలో మట్టి కుండలో నీళ్ళే ఎందుకు తాగాలి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.