ఎలా పరుగెత్తడం వల్ల మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు..?  

షేర్ చేయండి:
ఎలా పరుగెత్తడం వల్ల మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు..?  

సాక్షి లైఫ్ : ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి రన్నింగ్ ఉత్తమ వ్యాయామా లలో ఒకటి. చాలా మంది ఉదయాన్నే లేవగానే పరుగెత్తడానికి బయటకు వెళ్తారు. కొంతమంది వేగంగా పరిగెత్తితే మరికొందరు నెమ్మదిగా పరిగెత్తుతారు. అటువంటి పరిస్థితిలో ఈ రెండింటిలో ఏది మంచిది అనే ప్రశ్న తలెత్తుతుంది. స్లో రన్నింగ్ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మెల్లగా పరుగెత్తడం వల్ల గుండె ,మనస్సు రెండింటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో ఊబకాయం నుంచి ఉపశమనం పొందవచ్చు. స్లో రన్నింగ్ వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నెమ్మదిగా పరుగెత్తడం ఎందుకు ప్రయోజనకరమంటే..?  

నెమ్మదిగా పరుగెత్తడం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. స్లో రన్నింగ్ క్యాలరీలను సులభంగా బర్న్ చేస్తుంది. దీని వల్ల గాయపడే ప్రమాదం ఉండదు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎక్కువసేపు నెమ్మదిగా రన్నింగ్ చేయవచ్చు.  వేగంగా రన్నింగ్ చేస్తే తొందరగా అలసిపోతారు. స్లోగా రన్నింగ్ చేయడం వల్ల ఎక్కువ దూరం వెళ్లవచ్చు.

స్లో రన్నింగ్ తో.. 

 స్లో రన్నింగ్ గుండె ఆరోగ్యానికి చాలామంచిది. రోజూ నెమ్మదిగా పరుగెత్తడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. నెమ్మదిగా నడుస్తున్న కారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తుల గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విషయంలో వైద్యుల సలహా కూడా తీసుకోవాలి.

స్లో రన్నింగ్ వల్ల కలిగే ప్రయోజనాలివే.. 

 స్లో రన్నింగ్ అధిక కొలెస్ట్రాల్, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నెమ్మదిగా పరుగెత్తడం వల్ల రక్తపోటు సమస్యను కూడా దూరం అవుతుంది.హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా నెమ్మదిగా రన్నింగ్ చేస్తే బీపీని అదుపులో ఉంటుంది.స్లో రన్నింగ్ ద్వారా ఒత్తిడి ,ఆందోళన సమస్య కూడా నయమవుతుంది. నెమ్మదిగా పరుగెత్తడం వల్ల కీళ్లు, కండరాలపై తక్కువ ఒత్తిడి పడుతుంది తద్వారా ఎలాంటి ప్రమాదం ఉండదు. స్లో రన్నింగ్ మొత్తం ఆరోగ్యానికి మంచిది. అయితే, ఏదైనా తీవ్రమైన అనారోగ్యం విషయంలో పరుగు ముందు డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.