గ్రీన్ కాఫీ బెనిఫిట్స్ తెలుసా..?
సాక్షి లైఫ్ : గ్రీన్ టీ మాత్రమే కాదు.. గ్రీన్ కాఫీ అనేది కూడా ఒకటి ఉందని మీకు తెలుసా..? గ్రీన్ కాఫీ శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కెఫిన్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. గ్రీన్ కాఫీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఈ కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి గ్రీన్ కాఫీ తాగుతారు. ఇది మెరిసే చర్మంతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి.. మష్రూమ్స్ తో హెల్త్ బెనిఫిట్స్ ఇవే..
యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలం..
గ్రీన్ కాఫీ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హానికరమైన ప్రభావాల నుంచి రక్షిస్తాయి. ఇవి తక్కువ పొటాషియం, సోడియంను కలిగి ఉంటుంది. కాబట్టి హైబీపీ ఉన్న రోగులకు చాలాబాగా పనిచేస్తుంది.
డయాబెటిక్ రోగులకు మేలు..
డయాబెటిక్ రోగులకు గ్రీన్ కాఫీ ఎంతో మేలు చేస్తుంది. దీనిని తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ ఉన్నవారు గ్రీన్ కాఫీని డైట్‌లో భాగంగా చేసుకుంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది.
శరీరానికి శక్తి..
గ్రీన్ కాఫీని ఎనర్జీ బూస్టర్ అంటారు. అలసిపోయినప్పుడు గ్రీన్ కాఫీ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి, గ్రీన్ కాఫీ గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు ఈ కాఫీ గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. గ్రీన్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ సమస్యను నివారించవచ్చని ఓ రీసెర్చ్ లో వెల్లడైంది.
ఇది కూడా చదవండి.. స్నానానికి ఏ నీళ్లు బెటర్..?
చర్మానికి..
గ్రీన్ కాఫీలో ఫ్యాటీ యాసిడ్స్, రైజిక్ యాసిడ్, లినోలెయిక్ యాసిడ్ ,ఒలేయిక్ యాసిడ్ ఉన్నాయి, ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
