టీకా తీసుకున్నప్పుడు జ్వరం రాకూడదా..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యానికి సంబంధించిన అనేక పుకార్లు కొన్నేళ్లుగా ప్రచారంలో ఉన్నాయి. వీటిని ప్రజలు కొన్నిసార్లు వారి సౌలభ్యం ప్రకారం నమ్ముతూ ఉంటారు. ఐతే కొన్నిసార్లు తిరస్కరిస్తూ ఉంటారు. కొన్ని విషయాలు వాటి అర్థం తెలియక ఏళ్ల తరబడి అనుసరిస్తూనే ఉన్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి అనేక అపోహలు సమాజంలో వ్యాప్తి చెందుతున్నాయి.. అటువంటివాటిలో కొన్ని మనం గుడ్డిగా అనుసరిస్తూ ఉంటాం. మరికొన్నిటిని అవి నిజం కాదని కొట్టిపారేస్తుంటాం. ఆరోగ్యానికి రెండు అపోహలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..తినేముందు మామిడి పండ్లను ఎందుకు నానబెట్టాలి..?
అపోహ-1 వేళ్లు విరవడం వల్ల కీళ్లనొప్పులు వస్తాయా..?
వాస్తవం కాదు.. ఇది అస్సలు వాస్తవం కాదు. వేళ్లు విరవడం అనేది ఒక సాధారణ భౌతిక ప్రక్రియ. దీనిలో కీళ్ల మధ్య కార్బన్ డయాక్సైడ్ బుడగలు పగిలిపోవడం వల్ల గ్యాస్ విడుదల అవుతుంది. వేళ్లు విరిచినప్పుడు అదే శబ్దం వినబడుతుంది. ఆర్థరైటిస్‌తో ప్రత్యక్ష సంబంధం లేదు. వేళ్ళు విరవడం వల్ల కీళ్ల నొప్పులు రావు.
అపోహ 2- టీకా వల్ల ఫ్లూ వస్తే మంచిది కాదా..?
వ్యాక్సిన్‌లు కొన్నివ్యాధులను అరికడతాయి. కొంతమంది టీకా తీసుకోకుండా పారిపోతారు. మరికొంతమంది భయపడుతుంటారు. టీకాలు వేయడం వల్ల ఫ్లూ సోకే అవకాశం ఉందని భావించడం సరికాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌లో వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా చాలా తక్కువ పరిమాణంలో శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. తద్వారా బ్యాక్టీరియాతో పోరాడటానికి శరీరంలో యాంటీబాడీలు ఏర్పడతాయి.
అప్పుడు భవిష్యత్తులో ఎప్పుడైనా ఎలాంటి వ్యాధితో అయినా పోరాడడానికి అవకాశం ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో వ్యాక్సిన్ ఫ్లూకు కారణమవుతుందనే ఆలోచన తప్పని వారు అంటున్నారు. టీకా తర్వాత కొంత జ్వరం ఉండవచ్చు, కానీ అది ఫ్లూ కాదని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. బ్లాక్ సాల్ట్ బెనిఫిట్స్ ఎన్నో..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
