సాక్షి లైఫ్ : మామిడి పండు అంటే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కానీ తినడానికి ముందు కొంచెం సేపు నీటిలో నానబెట్టమని చెబుతారు. తినేముందు ఎందుకు నాన బెట్టాలి..? నాన బెట్టడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..? ఒకవేళ నాన బెట్టకపోవడంవల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఎందుకంటే..?
వేసవి కాలం ప్రారంభం కాగానే అందరూ మామిడికాయల కోసం ఎదురుచూస్తుంటారు. పండ్లలో రారాజుగా పిలుచుకునే మామిడి పండు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఈ పండును చూస్తే అస్సలు తినకుండా ఉండలేరు. రుచితో పాటు ఎన్నో పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే మామిడి పండు తినే ముందు మన అమ్మలు లేదా అమ్మమ్మలు మామిడికాయను నీళ్లలో కాసేపు నానబెట్టమని చెబుతూ ఉంటారు. అది మీరు గమనించే ఉంటారు, కానీ ఎందుకు అలా అంటారు? దీని వెనుక కారణం ఏంటో తెలుసా? కాకపోతే, మామిడిని తినడానికి ముందు నీటిలో నానబెట్టడం ఎందుకు ముఖ్యమంటే..?
ఇది కూడా చదవండి.. బ్లాక్ సాల్ట్ బెనిఫిట్స్ ఎన్నో..
నీటిలో నానబెడితే..
నీటిలో నానబెట్టిన మామిడిపండు తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. నిజానికి, మామిడిపండు తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా నాన బెట్టి తినాలని పరిశోధకులు చెబుతున్నారు. నాన బెట్టకుండా తింటే జీర్ణక్రియ, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే నీటిలో కాసేపు నానబెట్టి తినాలి.
ఫైటిక్ యాసిడ్..
మామిడిలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ న్యూట్రియంట్, ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. దాని అధిక పరిమాణం కారణంగా శరీరంలో పోషకాల లోపం తలెత్తవచ్చు. అయితే, మామిడిని అరగంట పాటు నీటిలో నానబెట్టడం ద్వారా ఫైటిక్ యాసిడ్ స్థాయిని తగ్గించవచ్చు, అప్పుడు ఇది ఆరోగ్యానికి హాని కలిగించదు.
పురుగుమందులు, ఎరువులు..
ఈ రోజుల్లో పలురకాల పండ్లు కాయలను పండించడానికి అనేక హానికరమైన పురుగుమందులు, ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. ఇవి మామిడి తొక్కపై పేరుకుపోయి ఉంటాయి. ఇవి నాన బెట్టకుండా తింటే అవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే వాటిని నీటిలో నానబెట్టడం చాలా అవసరం. తద్వారా వాటిపై ఉన్నపురుగుమందులు శుభ్రంగా పోతాయి.
మొటిమలు, దద్దుర్లు..
మామిడిలో కొంత మొత్తంలో రసం ఉంటుంది. ఇది మొటిమలు, దద్దుర్లు లేదా అలెర్జీ వంటి చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. మామిడికాయను నీళ్లలో కాసేపు నానబెట్టడం వల్ల ఈ రసాన్ని తగ్గిస్తుంది , చర్మానికి హాని కలిగించదు.
మామిడికాయను నానబెట్టకుండా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అందువల్ల, కొంత సమయం పాటు నానబెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మామిడి పండ్లను నానబెట్టడం వల్ల దాని హైడ్రేటింగ్ లక్షణాలను కూడా పెంచుతుంది. ఇది వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి.. తినే సమయంలో నీళ్లు తాగకూడదా..? ఏమౌతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com