పీఎం నరేంద్ర మోడీ ఆరోగ్య రహస్యాలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రధాని నరేంద్ర మోదీకి ఈరోజు అంటే సెప్టెంబర్ 17తో 74ఏళ్లు. ఇవాళ భారత దేశ ప్రధాని మోదీ పుట్టినరోజు. ఈ వయసులో కూడా ఆయన ఉత్సాహం, ఫిట్‌నెస్ అందరికీ స్ఫూర్తిదాయకం. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి ఆహారపుఅలవాట్లు, జీవనశైలి అలవాట్లు చాలా ముఖ్యం. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ విషయంలోనూ ఆయన తీసుకునే ఆహరం, జీవన శైలి అలవాట్లపైనే ఆయన హెల్త్ ఆధారపడి ఉంటుంది.   ప్రధాని మోదీ ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకుంటారు..? దినచర్య ఎలా ఉంటుంది..? అనేది ఇప్పడు  తెలుసుకుందాం.

 ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. 

 ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ప్రధాని మోదీ డైట్ ఏమిటి..?

నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ఆయన తీసుకునే డైట్ చాలా చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ ఆహారం విషయంలో చాలా కఠినంగా ఉంటారు. స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉంటారు. గుజరాతీ ఆహారం, ఖిచ్డీ నరేంద్ర మోదీకి ఇష్టమైన వంటకం. దీనితో పాటు, పెరుగు ప్రతిరోజూ తన  ఆహారంలో చేర్చుకుంటారు.

 
ప్రధాని మోదీ యోగాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా యోగా చాలా ముఖ్యం. ప్రధాని మోదీ తన రోజును మార్నింగ్ వాక్ తో ప్రారంభిస్తారు. ధ్యానంతో పాటు యోగాసనం, ప్రాణాయామం ,సూర్య నమస్కారాలు చేస్తారు. ఇవే అయన ఫిట్‌నెస్ కు ఎనర్జీకి సంబంధించిన అతి పెద్ద రహస్యాలు.
 

మోదీ తన ఆహారంలో హిమాచల్ ప్రదేశ్ మష్రూమ్ లను తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఉదయాన్నే అల్పాహారంలో కొన్ని తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటారు. ఉదయాన్నే లేవగానే అయన ఇంటిఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాక్ వే లో మాత్రమే కొద్దిసేపు నడుస్తారు. దీని స్పెషాలిటీ ఏమిటంటే..? కొంత దూరం రాళ్లు, ఆ తర్వాత  ఇసుక, కొంత దూరం మట్టి, ఇంకొంత దూరం గడ్డి ఉంటాయి. వీటిపై మోదీ నడుస్తారు. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.