Healthy Bathing Habits : ఆరోగ్యకరమైన స్నానం: ముందుగా నీళ్లు ఎక్కడ పోసుకోవాలి..? ఆయుర్వేద నియమాలివే..
సాక్షి లైఫ్ : స్నానం చేయడం మన దైనందిన జీవితంలో దినచర్య. అయితే, మనం స్నానం చేసే విధానం కూడా మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మీకు తెలుసా..? చాలామంది ఉదయం బాత్రూమ్లోకి వెళ్లగానే నేరుగా తలపై నుంచి నీళ్లు పోసుకుంటూ స్నానం మొదలుపెడతారు. కానీ, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. ఇలా అకస్మాత్తుగా తలపై నీళ్లు పోసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరి స్తున్నారు. స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన సరైన పద్ధతులు, ఆయుర్వేద నియమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ముందుగా పాదాలపైనే..
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ ముందుగా పాదాలపై నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాతే నెమ్మదిగా కింది నుంచి పైకి అంటే.. కాళ్లు, చేతులు, పొట్ట, ఛాతీ భాగాలపై నీళ్లు పోసుకుంటూ చివరగా తలపైకి రావాలి. ఇలా చేయడం వల్ల నీటి ఉష్ణోగ్రతకు మన శరీరం నెమ్మదిగా, క్రమపద్ధతిలో అలవాటు పడుతుంది. ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులను శరీరం సమర్థవంతంగా తట్టుకుంటుంది.
తలపై నేరుగా ఎందుకు పోసుకోకూడదు..?
అకస్మాత్తుగా తలపై చల్లటి లేదా వేడి నీళ్లు పోసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు వస్తుంది. దీనివల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడి కొందరిలో కళ్లు తిరగడం, అసౌకర్యంగా అనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో మైగ్రేన్, సైనస్, అధిక రక్తపోటు (bp) వంటి సమస్యలు ఉన్నవారు తలపై నేరుగా నీళ్లు పోసుకుంటే తీవ్రమైన తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పాదాల నుంచే స్నానం ప్రారంభించడం అత్యుత్తమమైన మార్గం.
ఆయుర్వేదం సూచిస్తున్న మరికొన్ని స్నాన నియమాలు..
సరైన క్రమంలో నీళ్లు పోసుకోవడంతో పాటు, ఆయుర్వేదం స్నానానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన నియమాలను సూచిస్తోంది.మరీ వేడిగా లేదా మరీ చల్లగా ఉన్న నీటితో స్నానం చేయకూడదు. వాతావరణం, శరీర తత్వాన్ని బట్టి నీటి ఉష్ణోగ్రతను ఎంచుకోవాలి. ముఖ్యంగా అధిక వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ నూనెలు నశించిపోయి చర్మం పొడిబారుతుంది.
స్నానానికి ముందు మర్దన..
స్నానానికి వెళ్లే ముందు కొద్దిగా నూనెతో అంటే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె శరీరానికి తేలికగా మర్దన చేసుకోవడం వల్ల చర్మానికి మంచి నిగారింపు రావడంతో పాటు రక్తప్రసరణ మెరుగవుతుంది. కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. ఉదయం పూట మేలు.. శారీరక, మానసిక ఉల్లాసానికి ఉదయం పూట చేసే స్నానమే ఎంతో ఉత్తమమైనదని ఆయుర్వేదం చెబుతోంది. గంటల తరబడి నీళ్లలో గడపడం చర్మానికి ఏమాత్రం మంచిది కాదు.
స్నానాన్ని మరీ హడావుడిగా కాకుండా, అలాగని అతిగా చేయకుండా మితమైన సమయంలో ముగించాలి. స్నానం ముగిసిన వెంటనే శుభ్రమైన, పొడిగా ఉన్న టవల్‌తో మాత్రమే శరీరాన్ని తుడుచుకోవాలి. తడి టవల్ వాడితే అందులో బ్యాక్టీరియా చేరి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. తుడుచుకున్న తర్వాత చర్మానికి తగిన మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోవద్దు.
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
