హార్ట్ కేర్ : గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గుండెపోటు ప్రమాదం పెరగడంపై కార్డియాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటు కేసులను పరిశీలిస్తే, దానికి అనేక కారణాలున్నాయని చెబుతున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇలాంటి వ్యాధులను పెంచుతున్నాయని అంటున్నారు. పని ఒత్తిడి కారణంగానూ, శారీరక శ్రమ లేకపోవడం వంటివి కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

జిమ్‌కు వెళ్లే వారిలో కూడా గుండె పోటుకేసులు పెరిగాయి, దీనికి ఒక కారణంట్రైనర్, అతిగా వ్యాయామం చేయడం కావచ్చు. ఎక్కువగా వ్యాయామం చేసిన సమయంలో, రక్త ప్రసరణ పెరుగుతుంది, రక్తనాళాలపై అప్పుడు ఒత్తిడి పెరిగి గుండె భాగాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

  జిమ్‌కి వెళితే, కొలెస్ట్రాల్, రక్తపోటును తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చాలామంది వీటిపై శ్రద్ధ చూపరు. అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు తీవ్రమైన వ్యాయామం చేస్తే, రక్త ప్రవాహం పెరగడం వల్ల, ధమనులపై ఒత్తిడి పెరుగుతుంది, ఇది గుండెపోటుకు కూడా కారణమవుతుంది.

కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి, తద్వారా శరీరంలో సంభవించే సమస్యలను సకాలంలో గుర్తించి గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడొచ్చు.  

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.