Hot water in winter : చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయకూడదా..?
సాక్షి లైఫ్: చలికాలం వచ్చిందంటే చాలు... వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ హాయే వేరు! గడ్డకట్టే చలి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది వేడినీళ్లతో స్నానం చేయడానికే ఆసక్తి చూపిస్తారు. కానీ, అతిగా వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదా, కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అతి వేడి నీళ్లు శరీరానికి కొన్ని అనూహ్య సమస్యలను తీసుకురావచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు. చర్మ తేమ తగ్గిపోవడం జరుగుతుంది. వేడి నీళ్లు చర్మంలోని సహజ నూనెలను తొలగించి చర్మం పొడిబారడం, దురద, ఎర్ర బడడం వంటి సమస్యలు తెలెత్తవచ్చు.
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
బ్లడ్ ప్రెషర్‌పై కూడా ప్రభావం..అధిక ఉష్ణోగ్రత నీళ్లు రక్తనాళాలు వెంటనే విస్తరించేందుకు కారణమై బీపీ అకస్మాత్తుగా పడిపోవచ్చు.వేడి నీళ్లు జుట్టు రూట్స్‌ను దెబ్బతీసి హెయిర్ ఫాల్‌ను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
సెన్సిటివ్ స్కిన్‌కు హానికరం.. గజ్జి, తామర, సోరియాసిస్ ఉన్నవారికి వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆయా సమస్యలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. చలికాలంలో గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మాత్రమేఉత్తమం అని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. సౌకర్యం కోసం వేడినీళ్లు బాగానే అనిపించినా, బాగావేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరం. ప్రత్యేకంగా చర్మ సమస్యలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
