శరీరంలోకి ప్లాస్టిక్ ఎలా ప్రవేశిస్తుంది..?
సాక్షి లైఫ్ : నీటి సీసాల నుంచి ఆహార ప్యాకింగ్ వరకు, ప్రతిచోటా ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారు. కానీ ఈ ప్లాస్టిక్ మన ఆరోగ్యానికి విషంగా మారుతోందని మీకు తెలుసా? ప్లాస్టిక్ కాలుష్యం అంటే ప్లాస్టిక్ వ్యర్థాలు వాతావరణంలో పేరుకుపోవడం. వీటిని పూర్తిగా నాశనం చేయడం సులభం కాదు. ఇవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రోప్లాస్టిక్‌లుగా మారతాయి. అవి మనం తీసుకునే ఆహారం, పానీయాలు, మనం పీల్చే గాలిలో కూడా చేరిపోతాయి. అలా మూడు రకాలుగా మన శరీరంలోకి ప్లాస్టిక్ కణాలు ప్రవేశిస్తాయి.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇవి మన శరీరంలోకి ప్రవేశించినతర్వాత మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే..?
హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడం..
ప్లాస్టిక్‌లో బిస్పోనల్ ఏ (బిపిఏ), థాలేట్స్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి స్త్రీలు, పురుషులు ఇద్దరిలోనూ హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. ఇది ప్రత్యుత్పత్తి సామర్థ్యం, జీవక్రియ (మెటబాలిజం) పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
క్యాన్సర్ ప్రమాదం..
ప్లాస్టిక్‌లో ఉండే రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసిన ఆహారాన్ని ఎక్కువ కాలం తినడం వల్ల రొమ్ము, కాలేయం, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
