ఆబ్సెన్స్ సీజర్స్‌లో ఎన్నిరకాలున్నాయి..?
సాక్షి లైఫ్ : ఆబ్సెన్స్ సీజర్స్‌లో ప్రధానంగా టిపికల్, అటిపికల్ అనే రకాలు ఉంటాయి. టిపికల్ సీజర్స్: ఇవి ఎమ్ఆర్ఐ వంటి పరీక్షలతో నిర్ధారిస్తారు. అటిపికల్ రకాలు: ఇతర నరాల సంబంధిత సమస్యలు, జీవక్రియలకు సంబంధించిన, జన్యు సంబంధిత పరీక్షలతో పాటు మెదడు, వెన్నుపూస చుట్టూ ఉండే ద్రవం (సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్)ను పరీక్షించడం ద్వారా తెలుసుకుంటారు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
చికిత్స ఎలా అంటే..?
సమస్య నిర్ధారణ అయిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. దీనికోసం ఫిట్స్ మందులు (యాంటీ సీజర్ మెడిసిన్స్) వాడాలి. వీటిని కనీసం రెండేళ్ల పాటు వాడాల్సి ఉంటుంది. అలా వాడటం వల్ల వ్యాధి నుంచి కొంత ఉపశమనం లభించి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పిల్లల పరిస్థితిని గమనిస్తూ, దాని ప్రకారం మందుల మోతాదును క్రమంగా తగ్గించుకుంటూ పోవాలి. ఈ మందులు పిల్లల్లో ఫిట్స్ తగ్గించడమే కాకుండా, వారి జీవన నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి, స్కూల్లో వారి సామర్థ్యాన్ని పెంచుతాయి.
దాదాపు 70శాతం కేసుల్లో పిల్లలు యుక్తవయసు వచ్చేనాటికి మంచి స్పందన కనిపిస్తుంది. సామాజికంగా ఒంటరి కాకుండా నలుగురితో కలిసిపోయేలా చేస్తాయి. మందుల ప్రభావం ఎలా ఉందనేది నిర్దిష్ట వ్యవధుల్లో కొన్ని పరీక్షలు చేయడం ద్వారా పర్యవేక్షించాలి. సహాయక చికిత్సలుగా వారికి కీటోజెనిక్ డైట్ (కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం) ఇవ్వడం, వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ వంటివి చేస్తారు.మీ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
