హిమోఫిలియా ఎన్ని రకాలు..?

షేర్ చేయండి:
హిమోఫిలియా ఎన్ని రకాలు..?

సాక్షి లైఫ్ : హిమోఫిలియా వ్యాధిలో రెండు రకాలున్నాయి. వీటిలో ఒకటి హిమోఫిలియా ఏ . ఇది ఫ్యాక్టర్‌ 8 లోపం కారణంగా వస్తుంది. రెండోది హిమోఫిలియా బి. ఇది ఫ్యాక్టర్‌ 9లోపించడం వల్ల తలెత్తుతుంది. రక్తం గడ్డకట్టే విధానాన్ని కోల్పోవడం వల్ల తీవ్ర రక్తస్రావం అవుతుంది. దీనికి జెనటిక్‌ కౌన్సిలింగ్‌తో పాటు అవసరమైన వారికి కోల్పోయిన బ్లడ్‌ ఫ్యాక్టర్స్‌ ఎక్కించాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి.. పార్కిన్సన్స్ నివారణకు ఏమేం చేయాలి..? 

 హిమోఫిలియాకు కారణం.. ?

రక్తంలో థ్రోంబోప్లాస్టిన్ అనే పదార్ధం లోపించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. థ్రోంబోప్లాస్టిక్‌కు రక్తాన్ని త్వరగా గడ్డగా మార్చే సామర్థ్యం ఉంటుంది. ఇది రక్తంలో లేకపోవడం వల్ల రక్తస్రావం ఆగదు. దీని కారణంగా హిమోఫిలియా వ్యాధి వచ్చిన వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది.  

 హిమోఫిలియాకు మరొక పేరు కూడా ఉంది..

హిమోఫిలియాను బ్రిటిష్ రాయల్ డిసీజ్ అని కూడా అంటారు. ఇది జన్యుపరమైన వ్యాధి, ఈ రోగం ఉన్నవారిలో రక్తం గడ్డకట్టదు. సాధారణంగా హిమోఫిలియా వ్యాధి రెండు రకాలు. హిమోఫిలియా A , హిమోఫిలియా B. హిమోఫిలియా A కారకం 8 లోపానికి కారణమవుతుంది.

 ఎలాంటివారికి వస్తుంది..? 

హిమోఫిలియా అనేది వంశపారంపర్య రక్తస్రావం రుగ్మత, ఇది ప్రధానంగా పురుషులలోనే ఎక్కువగా వస్తుంది. స్త్రీలలో అరుదుగా వచ్చే అవకాశం ఉంటుంది. 

 పురుషులలో ఎందుకు ఎక్కువగా వస్తుందంటే..?

పురుషులు X క్రోమోజోమ్‌లో ఉన్న జన్యువు కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా, హీమోఫిలియా A వంటి X- లింక్డ్ డిజార్డర్స్ మగవారిలో ఎక్కువగా కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి.. మెదడుకు ఆక్సిజన్ ఎంతసేపటి వరకూ అందకపోతే డ్యామేజ్ అవుతుంది..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.