గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే..?
సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకుండా ఏసీ గదుల్లో ఎక్కువ సమయం గడపడం, మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా మధుమేహ వ్యాధి తీవ్రతను పెంచుతాయి. మధుమేహాన్ని నియంత్రించడానికి కొన్ని ఆహార పదార్థాలు ఎంతో సహాయపడతాయి. వీటిలో కొన్ని..
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
మెంతులు..
రాత్రి సమయంలో ఒక టీ స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో నానబెట్టాలి. తరువాత ఉదయం నిద్ర లేచి పరగడుపున ఈ నీటిని తాగడం ద్వారా చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. టైప్ 2 మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ పది గ్రాముల మెంతులను రాత్రికి నానబెట్టి, ఉదయం తాగడం ద్వారా హిమోగ్లోబిన్ ఏవన్ సి లెవల్స్ గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
కాకరకాయ..
కాకరకాయ చేదుగా అనిపిస్తుంది కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ కాకరకాయ రసం తాగడం వల్ల షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాకరకాయలో ఉన్న పాలీపెప్టైడ్ అనే పదార్థం శరీరంలో షుగర్ స్థాయిలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.
ఉసిరికాయ..
ఆయుర్వేదంలో ఉసిరికాయను అత్యంత శక్తివంతమైన ఔషధంగా భావిస్తారు. మూడు ఉసిరికాయలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, అందులో గ్లాసు నీరు కలిపి గ్రైండ్ చేయాలి. ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచి పరగడుపున ఈ మిశ్రమాన్ని తినడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
దాల్చిన చెక్క..
గ్లాసు వేడినీటిలో నాలుగు చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసి, మూతపెట్టాలి. పదినిమిషాలు నంబెట్టినతర్వాత అంటే భోజనం చేసిన అనంతరం ఈ నీటిని తాగడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహం నియంత్రణలో ఉంచుకోవచ్చు, ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చు.
ఇది కూడా చదవండి..జామపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..గట్ మైక్రోబయోమ్ జీర్ణవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
