మలేరియా లక్షణాలను ఎలా గుర్తించాలంటే..?
సాక్షి లైఫ్ : ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల మలేరియా వస్తుంది. ఇది దోమ కాటు ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మలేరియా పరాన్న జీవులను వ్యాప్తి చేసే దోమలను అనాఫిలిస్ అంటారు. అయితే దోమల బెడదను నివారించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. ఇది ప్రమాదకరమైనప్పటికీ ముందుగా వ్యాధి లక్షణాలను గుర్తిస్తే సులువుగా దాని నుంచి బయటపడొచ్చు.
ఇది కూడా చదవండి.. World Malaria Day : మలేరియా అంటే ఏమిటి..?
అధిక జ్వరం..
మలేరియాకి సంబంధించిన మొదటి కనిపించే లక్షణం తీవ్ర జ్వరం. అధిక జ్వరానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త దృష్ట్యా జ్వరం వచ్చినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
చలి..
అధిక జ్వరం కారణంగా చలి తీవ్రంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ లక్షణం కూడా మలేరియా లక్షణాల్లో ఒకటి.
మూత్రంలో రక్తం..
మూత్రంలో రక్తం ఈ వ్యాధికి సంకేతం. అందువల్ల, ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
విరేచనాలు..
కడుపు నొప్పి ,విరేచనాలు కూడా మలేరియా లక్షణాలే.
వికారం లేదా వాంతులు..
మలేరియా వికారం లేదా వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. విపరీతమైన వాంతులు కారణంగా శరీరంలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తవచ్చు. కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
అధిక అలసట..
మలేరియా లక్షణాల్లో అధికంగా అలసట కలుగుతుంది.
ఒళ్లు నొప్పులు..
కడుపునొప్పి, తలనొప్పి , ఒళ్లు నొప్పి, కండరాల తిమ్మిరి వంటి సమస్యలు కూడా రావచ్చు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..
మలేరియా విషయంలో కూడా సరిగా శ్వాస తీసుకోలేకపోవడం వంటి సమస్య తలెత్తుతుంది.
మూర్ఛ లేదా గందరగోళం..
మలేరియా తీవ్రమైన సందర్భాల్లో, వ్యక్తి స్పృహ కోల్పోవడం లేదా గందరగోళానికి గురికావడం జరుగుతుంది.
ఇది కూడా చదవండి.. ఎలాంటి రోగాలకు యునాని ఉపయోగపడుతుంది..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
