సాక్షి లైఫ్ : దోమల బెడద పెరుగుతున్న దృష్ట్యా, వాటి వల్ల వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినవసరం ఎంతైనా ఉంది. దోమల వల్ల వచ్చే అత్యంత తీవ్రమైన వ్యాధి మలేరియా. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం అవుతుంది. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?
సకాలంలో చికిత్స అందకపోతే..
మలేరియా వ్యాధికి సకాలంలో చికిత్స అందకపోతే అది తీవ్ర రూపం దాల్చి ప్రాణాపాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దాని లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మలేరియా ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
వరల్డ్ మలేరియా డే సందర్భంగా మలేరియా నివారణ, దాని లక్షణాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం థీమ్ మలేరియా మెరుగైన చికిత్స, నివారణపై దృష్టి. మలేరియా ను ముందుగా గుర్తించడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడొచ్చు.
మలేరియా అంటే ఏమిటి..?
ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల మలేరియా వస్తుంది. ఇది దోమ కాటు ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మలేరియా పరాన్నజీవులను వ్యాప్తి చేసే దోమలను అనాఫిలిస్ అంటారు. అయితే దోమల బెడదను నివారించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.
మీ ఇంటి చుట్టూ నీరు చేరకుండా ఉండటం, సాయంత్రం పూట నిండుగా ఉన్న దుస్తులు ధరించడం, దోమతెరలు ఉపయోగించడం, క్రిమిసంహారక మందులు ఉపయోగించడం, మీ కూలర్‌లో నీటిని క్రమం తప్పకుండా మార్చడం, శుభ్రం పాటించడం ద్వారా దోమల వృద్ధిని నివారించవచ్చు, ఇది మలేరియా వ్యాప్తిని తగ్గిస్తుంది.
అంటువ్యాధి కాదు..
మలేరియా అంటువ్యాధి కాదు. అంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. దాని కొన్ని లక్షణాల సహాయంతో ఈ వ్యాధిని గుర్తించవచ్చు, ఇది రోగి జీవితాన్ని రక్షించడంలో గొప్ప సహాయం చేస్తుంది.
ఇది కూడా చదవండి.. తాజా అధ్యయనం : ఇలా చేస్తే గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com