సాక్షి లైఫ్ న్యూస్: ఎక్కువసేపు ఒకే చోట కూర్చోని జాబ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాల్లో తేలింది. ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాల కారణంగా శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి.
ప్రతిరోజూ 8-10 గంటలు కూర్చొని పని చేస్తే, మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డెస్క్ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కాలక్రమేణా తీవ్రమైన నరాల సంబంధిత రుగ్మతలను ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు దీనివల్ల అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
అల్జీమర్స్ వ్యాధి సహజంగానే 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొందరిలో వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి ముప్పు పెరుగుతోందని, దీని కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఓ పరిశోధనలో తేలింది.
కొన్ని దశాబ్దాల క్రితం వరకు వృద్ధులలో అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం చాలా తక్కువగా ఉండేది. అయితే కాలక్రమేణా వయస్సు తో సంబంధం లేకుండా ఇటువంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 55 మిలియన్ల మంది అల్జీమర్స్-డిమెన్షియాతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) చెబుతోంది.
JAMA(ద జర్నల్ ఆఫ్ ది అమెరికన్ అసోసియేషన్)జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ 10 గంటల కంటే ఎక్కువసేపు కూర్చొని ఉద్యోగం చేసేవారిలో డిమెన్షియా పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కొందరు రోజుకు తొమ్మిదిన్నర గంటల కంటే ఎక్కువ సమయం కేటాయిస్తారని, ఈ అలవాటుతో వృద్ధాప్యం తొందరగా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఎక్కువసేపు ఆఫీసులో కూర్చోవడమే కాకుండా, ఎక్కువసేపు కూర్చొని టీవీ చూడడం, కంప్యూటర్లపై ఎక్కువ సేపు పని చేయడం, డ్రైవింగ్ చేయడం వంటివి చేసే వారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఓ నివేదికలో వెల్లడైంది.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com