సరికొత్త చికిత్స..! : COVID-19 వ్యాక్సిన్‌తో కణితులకు చెక్..!
సాక్షి లైఫ్ : ప్రపంచాన్ని వణికించిన COVID-19 వ్యాక్సిన్‌లు (COVID-19 Vaccines) ఇప్పుడు క్యాన్సర్ చికిత్సలో (Cancer Treatment) కూడా సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్‌ల ద్వారా రోగులలో రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించి, క్యాన్సర్ కణితులను కూడా నిర్మూలించవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
క్యాన్సర్ చికిత్సలో సాధారణంగా ఇమ్యూన్ థెరపీని (Immune Therapy) ఉపయోగిస్తారు. అయితే, కొన్ని రకాల కణితులు రోగనిరోధక వ్యవస్థ దాడిని తట్టుకొని మొండిగా ఉంటాయి. ఈ పరిస్థితిలో, COVID-19 వ్యాక్సిన్‌ను ఇవ్వడం ద్వారా ఆ మొండి కణితులను కూడా ఇమ్యూన్ థెరపీకి స్పందించేలా చేయవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
వ్యాక్సిన్ పాత్ర..?
ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన ఎండీ ఆండర్సన్‌కు చెందిన డాక్టర్ ఆడమ్ గ్రిప్పిన్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. "వ్యాక్సిన్ శరీరంలో ఉన్న రోగనిరోధక కణాలను క్రియాశీలం చేయడానికి 'సైరన్' లా పనిచేస్తుంది," అని ఆయన తెలిపారు. "మొండిగా ఉన్న కణితులను ఇమ్యూన్ థెరపీకి స్పందించేలా మార్చడం ద్వారా చికిత్సకు సిద్ధం చేస్తున్నాము."
ఎలా పనిచేస్తుంది.. అంటే..?
COVID-19 వ్యాక్సిన్‌ను ఇవ్వడం వల్ల, శరీరంలో ఉధృతమైన ప్రతిరోధక స్పందన (Immune Response) మొదలవుతుంది. ఈ శక్తివంతమైన స్పందన వల్ల క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నాశనం చేసే రోగనిరోధక కణాలు (Immune Cells) మరింత చురుకుగా మారుతాయి. ఫలితంగా, కణితులను లక్ష్యంగా చేసుకుని పనిచేసే ఇమ్యూన్ థెరపీ చికిత్స ప్రభావం గణనీయంగా పెరుగుతుంది.
క్యాన్సర్ చికిత్సలో ఇదొక విప్లవాత్మక మార్పుకు నాంది పలకవచ్చని, మరింత మంది రోగులకు ప్రయోజనం చేకూర్చవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశంపై మరింత లోతైన అధ్యయనాలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
