Risk of Stroke: ఉష్ణోగ్రత మార్పులు స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్ సమస్యలను పెంచుతాయా..?  

షేర్ చేయండి:
Risk of Stroke: ఉష్ణోగ్రత మార్పులు స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్ సమస్యలను పెంచుతాయా..?  

సాక్షి లైఫ్ : ఉష్ణోగ్రతల్లో మార్పులు స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్ కేసుల పెరుగుదలకు దోహదం చేస్తాయా..? అంటే..? అవుననే సమాధానం వస్తుంది.. ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు రక్త నాళాలపై ఒత్తిడిని పెంచుతున్నాయని వైద్యులు అంటున్నారు. ఇటీవల ఆసుపత్రులలో స్ట్రోక్ రోగుల సంఖ్య పెరుగుతోంది. అధిక రక్తపోటు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. దీనిని నివారించడానికి, శరీరాన్ని చలికాలంలో వెచ్చగా ఉంచు కోవడంతోపాటు, రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవడం ఉత్తమమని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 వాతావరణంలో ఆకస్మిక మార్పులు, ప్రజల అజాగ్రత్త  ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా బ్రెయిన్ హెమరేజ్, స్ట్రోక్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు.  

తెల్లవారుజాము సమయంలోనూ, సాయంత్రం వేళల్లోనూ వీచే చల్లని గాలులు అధిక రక్తపోటు రోగులకు తీవ్ర ముప్పుకలిగిస్తాయని వైద్యనిపుణులు అంటున్నారు. చాలా మంది ఎయిర్ కండిషనర్లకు(AC) అలవాటుపడి నిద్రపోతున్నారు. వెచ్చని దుస్తులు లేకుండా ఉదయం నడకకు వెళ్తున్నారు. ఈ నిర్లక్ష్యం మెదడు రక్తస్రావం,పక్షవాతానికి దారితీస్తుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
 
అధిక రక్తపోటు రోగులకు.. 


ఈ రోజుల్లో నాడీ సంబంధిత రోగుల సంఖ్య పెరుగుతోందని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. చాలా మంది రోగులు ఇప్పటికే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు మందులు తీసుకుంటున్నారు, కానీ మారుతున్న ఉష్ణోగ్రతలు వారి రక్తపోటు అదుపు తప్పుతున్నాయి.

ఉదయం 6 గంటలకు ముందు, సాయంత్రం 6:30 గంటల తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు వెచ్చని దుస్తులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా చలిగాలి సమయంలో సైకిల్ తొక్కేటప్పుడు, చల్లని గాలి ముఖంలోని నరాలను నేరుగా ప్రభావితం చేయకుండా ఉండటానికి చెవులు, ముక్కు, నోటిని స్కార్ఫ్‌తో కప్పుకోవాలి. ముఖంలోని నరాలను ప్రభావితం చేయడం వల్ల పక్షవాతం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.  

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.  

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.