నిద్రనాణ్యత ను ఎలా మెరుగు పరుచుకోవాలంటే..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన శరీరానికి, మంచి ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ మాత్రమే కాదు. 7 నుంచి 8 గంటల వరకు నిద్ర కూడా చాలా అవసరం. నాణ్యమైననిద్ర మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉంచుతుంది. అయితే బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్యకరమైన ఆహారం, గాడ్జెట్‌ల వాడకం, పడకగదిలో ఉండే కాలుష్యం వంటి అనేక ఇతర అంశాలు నిద్రకు ఆటంకంగా మారుతున్నాయి. దీంతో నిద్రలేమి సమస్యలు తలెత్తి పలురకాల అనారోగ్య సమస్యల బారీన పడుతున్నారు.
ప్రతిఏటా వరల్డ్ స్లీపింగ్ డే రోజున ప్రజలకు నిద్రలేమితో ఎదురయ్యే సమస్యలను గురించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని 2008 నుంచి జరుపుతున్నారు. ఈ రోజు ప్రపంచ నిద్ర దినోత్సవంసందర్భంగా మీరు ఏ విషయాలపై శ్రద్ధ పెడితే నిద్ర నాణ్యతను మెరుగుపరచవచ్చు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బెడ్ షీట్లు , పిల్లోస్ క్రమం తప్పకుండా ఉతకాలి..
బెడ్ షీట్లు, పిల్లోస్, బ్లాంకెట్స్ ను కనీసం 140 డిగ్రీల ఫారెన్‌హీట్ వేడి నీటిలో ఉతకాలి. ఇలా చేస్తే అలర్జీ కారకాలు చాలా వరకు తొలగిపోతాయి. అలాగే, ప్రతి నెలా కాకుండా ప్రతి వారం బెడ్‌రూమ్ బెడ్‌షీట్‌లు , పిల్లో కవర్‌లను శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి. తద్వారా అలెర్జీ కారకాలకు దూరంగా ఉండవచ్చు. హాయిగా నిద్ర పోవచ్చు.
వాక్యూమ్ క్లీనింగ్..
దుమ్ము కణాలు చాలా చిన్నవిగా ఉంటాయి. పరుపులోకి లోతుగా వెళ్లి ఫైబర్‌లకు అంటుకుంటాయి. దీని కారణంగా వాటిని తొలగించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి బెడ్ రూమ్ ను డీప్ క్లీనింగ్ చేయడానికి వాక్యూమ్ క్లీనింగ్ ఉత్తమమైన ఎంపిక. నిద్రించే గదిలో దుమ్మును సులభంగా శుభ్రం చేయడానికి వాక్యూమ్ క్లీనింగ్ చాలాబాగా ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి.. స్కిన్ డిసీజెస్ కు కారణం.. అవగాహన లోపమే..
మూలలు, పగుళ్లను కూడా పరిశీలించండి..
బెడ్ షీట్లు, దిండ్లు, పరుపులు శుభ్రం చేయడంతోపాటు, మంచం మూలలు ,పగుళ్లను విస్మరించవద్దు. ఎందుకంటే అలెర్జీలకు కారణమయ్యే దుమ్ము పురుగులు అలాంటి ప్రదేశాల్లోనే ఎక్కువగా ఉంటాయి. వాటిని శుభ్రపరచడానికి వాక్యూమ్ క్లీనర్ ఉత్తమమైంది. దీనికి బదులు మీరు తడి గుడ్డను కూడా ఉపయోగించవచ్చు.
పడకగదిలో గాలి నాణ్యతను ఎలా మెరుగుపరచాలి..?
డ్రాయింగ్ రూమ్, వంటగదితో పోలిస్తే, పడకగదిని నిద్రించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ కిచెన్, హాల్ కంటే అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాల్సింది బెడ్ రూమ్. కొందరు బెడ్ రూమ్ ను అందంగా అలంకరించి, డియోడరెంట్‌లు లేదా సువాసనగల కొవ్వొత్తులను ఉపయోగిస్తుంటారు. ఇది సరైనది కాదని అవి కాలుష్యానికి కారణమవుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కాలుష్య కారకాలను ఎయిర్ ప్యూరిఫైయర్‌ల ద్వారా నియంత్రించవచ్చు. బెడ్‌రూమ్ లోపల గాలి నాణ్యతను మెరుగుపరచవచ్చు. ఇలా చేయడం ద్వారా హాయిగా నిద్రపోయివచ్చు. మీరు ఇంట్లో శుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా ప్రశాంతమైన నిద్ర పొందవచ్చు.
ఇది కూడా చదవండి.. రక్తపోటును అదుపులో ఉంచే టీ గురించి తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
