సాక్షి లైఫ్: అనువంశికంగానో, అనూహ్య వాతావరణ మార్పుల కారణంగానో... అంతకంతకూ విభిన్న రూపాల్లో విజృంభిస్తున్న చర్మవ్యాధులపై అవగాహన లేమి.. అంతర్జాతీయ సమస్య అంటున్నారు ప్రొఫెసర్, డాక్టర్ సందీపన్ ధర్ కోల్‌కతా లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ పీడియాట్రిక్ డెర్మటాలజీ విభాగాధిపతి, సొసైటీ ఆఫ్ ఎగ్జెమా స్టడీస్ అధ్యక్షునిగా సేవలు అందిస్తున్న ఆయన ఇటీవల హైదరాబాద్‌కి వచ్చారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ నగరంలో నిర్వహించిన 52వ వార్షిక జాతీయసదస్సు డెర్మాకాన్ 2024లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాక్షి లైఫ్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన పంచుకున్న విషయాలు, విశేషాలు ఆయన మాటల్లోనే..
ఇది కూడా చదవండి.. రక్తపోటును అదుపులో ఉంచే టీ గురించి తెలుసా..?
అతిపెద్ద చర్మవ్యాధి నిపుణుల సంస్థ మాది.. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డెర్మటాలజీ నిపుణులు ఉన్న సంస్థ మా సంస్థలో 18000 మంది సభ్యులున్నారు. ఈ డెర్మకాన్‌కు 8వేల మందికి పైగా హాజరయ్యారు. అంతర్జాతీయ నిపుణులు పాల్గొన్నారు. మన దేశంలో, గత కొన్ని దశాబ్దాలుగా దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై అధిక భారాన్ని మోపుతూ చర్మ వ్యాధుల ప్రాబల్యం పెరుగుతోంది. సొరియాసిస్ సహా పలు రకాల చర్మవ్యాధులపై చర్చించాం. వాతావరణ మార్పులు, కాలుష్యం.. తదితర ఎన్నో చర్మ సంబంధ సమస్యల కారకాలపై విశ్లేషించాం.
ఆటోపిక్ డెర్మటైటిస్.. విజృంభణ..
అటోపిక్ డెర్మటైటిస్ ఎగ్జిమా లాంటిదే ఇది కూడా. ఎలర్జిక్ గ్రైనైటిస్, ఎగ్జిమా..
రెండేళ్ల వయసులోపు చిన్నారులపైనా చర్మ వ్యాధి అటోపిక్ డెర్మటైటిస్ (ఎడి) శరవేగంగా విస్తరిస్తోంది. ఇది దేశంలో అనేక మందిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అత్యంత దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ చర్మ çసమస్యల్లో ఒకటి ఇది దద్దుర్లు లేదా చర్మ గాయంలా ఇది కనిపిస్తుంది, దీని వలన చర్మం పొడిబారుతుంది దురదగా అనిపిస్తుంది. ఇది ప్రభావితమైన వ్యక్తుల రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తుంది. నిద్ర ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది.
మూడింటి లక్షణాల కలయిక..
అస్తమా బ్రాంకొటైటిస్, ఎగ్జిమా, అలర్జిక్ రైనైటిస్.. మూడింటి లక్షణాల కలయికగా దీన్ని పేర్కొనవచ్చు. ఎక్కువగా రెండేళ్లలోపు చిన్నారులను, ఆ తర్వాత 12 ఏళ్ల లోపువారిపై, ఆ తర్వాత 18 లోపు వయసు వారిపైనా అరుదుగా పెద్దల్ని కూడా వేధిస్తోంది. ఈ వ్యాధి ఐదారేళ్ల నుంచీ పదేళ్ల వరకూ కొనసాగవచ్చు. ఈ వ్యాధి చిన్నారుల శారీరక, మానసిక వికాసాలపై వారి భవిష్యత్తుపై పూర్తి స్థాయిలో ప్రభావం చూపిస్తుంది వారి సమగ్ర వికాసం మందగిస్తుంది. దీనికి సంబంధించిన చికిత్స కూడా చాలా సంక్లిష్టంగా ఉంటుంది.
చికిత్సలో భాగంగా..
చికిత్సలో భాగంగా మాయిశ్చరైజర్స్, యాంటీబయాటిక్స్ ఇంకా అనేక పద్ధతులు అవలంభిస్తున్నారు. అయితే గత ఐదారేళ్లుగా ప్రభావవంతంగా దీన్ని నియంత్రించే విధానాలు, ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. ఇది వంశపారంపర్య వ్యాధి కూడా కానీ ఆ ఒక్కటి మాత్రమే కారణం అనలేం. పెరుగుతున్న కాలుష్యం సహా అనేక కారణాలు ఉండవచ్చు. అయితే పలు వైరల్ వ్యాధులకు ఉన్నట్టుగా దీని కోసం వ్యాక్సిన్స్‌లు ఇంకా రాలేదు.
సమస్య అదే..
చర్మవ్యాధులపై ప్రజల్లో తగినంత అవగాహన లేదు అనేది నిజం. ఇతర వ్యాధులపై మాట్లాడినంతగా చర్మ వ్యాధులపై మనం మాట్లాడడం లేదు. అయితే ఇది కేవలం మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. నేను ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ డెర్మటాలజీ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఎగ్జిమా...వంటి అనేక అంతర్జాతీయ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్విర్తిస్తూ ఏటా కనీసం 12 కీలకోపన్యాసాలు ఇస్తుంటాను. నేను గనమించింది ఏమిటంటే..?
సొసైటీ ఫర్ ఎగ్జిమా స్టడీస్ ఇండియా..
అమెరికా నుంచీ మన ఇండియా దాకా ప్రజల్లో చర్మ సంబంధ సమస్యలపై ఒకే తరహా అవగాహన కనిపిస్తోంది. అందుకే ఇటీవలే అమెరికా, బ్రిటన్, జర్మన్‌తో పాటు మన దేశంలోనూ విస్త్రుతంగా చర్మవ్యాధులపై అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాం. దీనిలో భాగంగా నేను ‘సొసైటీ ఫర్ ఎగ్జిమా స్టడీస్ ఇండియా’ ను రెండేళ్ల క్రితం ప్రారంభించాను. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌లోఇందులో పేషెంట్ కార్నర్ లో విస్త్రుతమైన సమాచారం భారీగా అందుబాటులో ఉంచాం. ఎటువంటి సందేహమైనా నివృత్తి చేసుకునేలా నిపుణుల సేవలు అందిస్తున్నాం.
ఇది కూడా చదవండి.. ఎలాంటి వారిలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువ..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com