పీసీఓడీని ఎలా అధిగమించాలంటే..?
సాక్షి లైఫ్ : పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్(పీసీఓడీ) సమస్యను నివారించడానికి కొన్నిరకాల జాగ్రత్తలు అవసరమని అందుకోసం జీవనశైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం ద్వారా పీసీఓడీ సమస్యను నివారించవచ్చని, డాక్టర్లు చెబుతున్నారు.
హార్మోన్ల ప్రభావం వల్ల..
పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్. ఈ రుగ్మత ఇటీవలకాలంలో మహిళల్లో సర్వసాధారణంగా మారింది. హార్మోన్ల ప్రభావం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. పీసీఓడీ సమస్య కారణంగా అండాశయం నుంచి అండం విడుదల కాదు. దీని వల్ల నెలసరి కూడా రాదు. ప్రధానంగా అండాశయంలో అండం ఉండటంతో దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తాయి. ఈ సమస్యను నివారించడానికి జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మండే ఎండల్లో ఎయిర్ కూలర్లు, ఏసీలు అందరూ వాడొచ్చా..?
సమస్య ఉన్నవాళ్లు..
పీసీఓడీ సమస్య ఉన్నవాళ్లు ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే చక్కెరతో తయారు చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలను, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలని వైద్యులు వెల్లడిస్తున్నారు.
జీవక్రియ..
పీసీఓడీ తో బాధపడుతున్న వారు తమ ఆహారంలో ప్రోటీన్లను పెంచాలని, మాంసకృత్తులు తినడం వల్ల శరీరంలో జీవక్రియ వేగంగా జరుగుతుంది. అంతే కాకుండా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడం కూడా చాలా ముఖ్యం. దీని కోసం శారీరక శ్రమ చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన కొవ్వులు..
పిసిఓడి ప్రాబ్లెమ్ ఉన్నవాళ్లు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కొవ్వు పదార్ధాలకు బదులుగా, బాదం ,వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన వాటిని తినాలని వైద్యలు వెల్లడిస్తున్నారు.
శారీరక శ్రమ..
శారీరక శ్రమ చేయడం చాలా అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. వారానికి కనీసం ఐదు రోజులు వర్కవుట్ చేయాలని అంటున్నారు.
ఈ మార్పులన్నింటినీ అనుసరించడం ద్వారా పీసీఓడీ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. ప్రొస్టేట్ గ్రంథిలో వాపు వచ్చినప్పుడు.. ఏం జరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
