వాయు కాలుష్యం కారణంగా పెరగనున్న మధుమేహ సమస్య..
సాక్షి లైఫ్ : పెరుగుతున్న వాయు కాలుష్యం మనిషి జీవితకాలాన్ని తగ్గిస్తుంది. దీనికారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇటీవల వాయు కాలుష్యం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనంలో, PM 2.5 కారణమని కనుగొన్నారు పరిశోధకులు.వాయు కాలుష్యం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి మనందరికీ తెలుసు.
ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) AQI 400 కంటే ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఊపిరితిత్తులకు చాలా హాని కలిగిస్తుంది. వాయు కాలుష్యానికి ప్రధాన కారణం PM 2.5 కణాలు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. అవి మీ శ్వాస ద్వారా మీ ఊపిరితిత్తులలోకి, రక్తప్రవాహంలోకి కూడా ప్రవేశిస్తాయి. దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలుష్య కారకాలు ఎనిమిది ఉన్నాయి.అవి PM10, PM2.5, NO2, SO2, CO, O3, NH3, Pb.
కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటే టైప్-2 మధుమేహం వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ఢిల్లీ , చెన్నై ప్రజలపై జరిగింది. ఈ సర్వేలో, మధుమేహం, వాయు కాలుష్యం మధ్య సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఇందులో వాయు కాలుష్యం మధుమేహానికి కారణమవుతుందని వారు కనుగొన్నారు.
ఇది కూడా చదవండి.. ఎండా కాలంలో డ్రై ఫ్రూట్స్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
