ఊబకాయ సమస్యను ఎదుర్కోవడానికి ఏం చేయాలి..?
సాక్షి లైఫ్ : ఊబకాయాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటికే 'ఫిట్ ఇండియా మూమెంట్', 'ఈట్ రైట్ ఇండియా', 'పోషణ్ అభియాన్ 2.0' వంటి కార్యక్రమాలను ప్రారంభించింది. అయితే, దీనికి మించి మరిన్ని చర్యలు అవసరమని యూనిసెఫ్ సూచించింది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
జంక్ ఫుడ్స్ ప్రకటనలపై కఠిన నిబంధనలు.
ఆహార ప్యాకెట్ల ముందు భాగంలో హెచ్చరిక లేబుల్స్ తప్పనిసరి చేయడం.
జంక్ ఫుడ్స్‌పై ఆరోగ్య పన్నులు విధించడం.
పిల్లలు, తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించడం.
పాఠశాలల్లో ఆరోగ్యకరమైన ఆహారపు వాతావరణాన్ని ప్రోత్సహించడం.
యునిసెఫ్ ఇండియా డిప్యూటీ ప్రతినిధి ఆర్జాన్ డి వాగ్ట్ మాట్లాడుతూ, "ఈ రోజుల్లో పోషకాహార లోపం అంటే కేవలం బరువు తక్కువగా ఉండటం మాత్రమే కాదు. అనారోగ్యకరమైన ఆహారాలు, పానీయాల వల్ల వేగంగా పెరుగుతున్న ఊబకాయం పిల్లలు, యువతలో కూడా కొన్నిరకాల వ్యాధులను పెంచుతోంది.
ఈ సమస్యను ఇప్పుడు పరిష్కరించకపోతే, భవిష్యత్ తరాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం, సమాజం కలిసికట్టుగా పనిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
