హెచ్ పీవీ టీకా అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా అవసరమే..
సాక్షి లైఫ్ : హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్ పీవీ) అనేది ఒక వైరస్. దీని కారణంగా అనేక రకాల క్యాన్సర్లు వస్తాయి. వాటిలో గర్భాశయ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, ప్రైవేట్ భాగాల క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. సాధారణంగా ఈ వైరస్ ప్రైవేట్ భాగాలలోనే ఎక్కువగా వస్తుంది. ఈ వైరస్ నుంచి రక్షించడానికి, హెచ్ పీవీ టీకా ఎంతో ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇప్పటి వరకు, ఈ టీకాను ఎక్కువగా అమ్మాయిలకు మాత్రమే ఇస్తున్నారు. కానీ, తాజా పరిశోధనల ఆధారంగా, ఈ టీకా అబ్బాయిలకు కూడా అందించటం అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అబ్బాయిలలో కూడా హెచ్ పీవీవైరస్ సోకడం వల్ల అనేక రోగాలు, ముఖ్యంగా పెనిస్లో క్యాన్సర్, ఆనల్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ రిస్కు పెరిగే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
హెచ్ పీవీ టీకాను రెండు లేదా మూడు డోసులుగా ఇస్తారు. ఈ వ్యాక్సినేషన్ ద్వారా హెచ్ పీవీ వైరస్ సోకే అవకాశం తగ్గుతుంది. అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కలిగిస్తుంది. 9 నుంచి 14 సంవత్సరాల వయస్సు కలిగిన అబ్బాయిలకు వివిధ క్యాన్సర్‌లకు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమావైరస్ ను నిరోధించాలి. అందుకోసం హెచ్ పీవీ టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
