HPV Vaccine Not Necessary for Everyone : హెచ్‌పీవీ వ్యాక్సిన్.. అందరికీ వద్దు..! వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ హెచ్చరిక..
సాక్షి లైఫ్ : గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఇచ్చే హెచ్‌పీవీ (HPV) టీకా విషయంలో అప్రమత్తత అవసరమని వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ (WAF) స్పష్టం చేసింది. 'హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అందరికీ కాదు' (HPV VACCINATION NOT for ALL) అనే నినాదంతో బుధవారం హైదరాబాద్‌లో అవగాహన సదస్సు నిర్వహించింది. ముఖ్యంగా 'యీస్ట్' (Yeast) అలర్జీ ఉన్న బాలికలకు ఈ టీకా వేయడం ప్రాణపాయంగా మారే ప్రమాదం ఉందని ఫౌండేషన్ అధ్యక్షుడు, ప్రముఖ అలర్జీ నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..Ban Paraquat : ప్రాణాంతక గడ్డి మందు "పారాక్వాట్" ను నిషేధించాల్సిందే..! : వైద్య నిపుణులు
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
స్క్రీనింగ్ లేకపోతే తప్పదు ముప్పు..!
ప్రస్తుతం టీకా ఇచ్చే ముందు యీస్ట్ అలర్జీకి సంబంధించి ఎలాంటి పరీక్షలు చేయడం లేదని, ఇది ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ల తయారీలో 'శాక్రోమైసెస్ సెరెవిసియే' ను ఉపయోగిస్తారని, తయారీ తర్వాత కూడా దాని ప్రోటీన్ల అవశేషాలు టీకాలో ఉండిపోతాయని ఆయన వివరించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి (PMO) సాంకేతిక నివేదికను కూడా సమర్పించారు.
గమనించాల్సిన లక్షణాలు ఇవే..
టీకా వేసుకున్న తర్వాత యీస్ట్ అలర్జీ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. తీవ్రమైన దురద, దద్దుర్లు, ముఖం, నాలుక వాపు, ఆయాసం, పిల్లికూతలు (Wheezing), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. వికారం, వాంతులు, కడుపునొప్పి. రక్తపోటు తగ్గడం, గుండె వేగం పెరగడం, అనాఫిలాక్సిస్.
పరిశోధనలో తేలిందిదే..
హైదరాబాద్‌లోని అశ్విని అలర్జీ సెంటర్‌లో 300 మంది రోగులపై నిర్వహించిన స్కిన్ ప్రిక్ టెస్టుల్లో (Skin Prick Tests) దాదాపు 40 శాతం మందికి యీస్ట్ అలర్జీ ఉన్నట్లు తేలిందని డాక్టర్ నాగేశ్వర్ వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో అలర్జీ ముప్పు ఉన్నప్పుడు, పరీక్షలు చేయకుండా సామూహికంగా టీకాలు వేయడం వల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలి..
టీకా ఇచ్చే ముందు తప్పనిసరిగా అలర్జీ పరీక్షలు నిర్వహించాలి.
రిస్క్ ఉన్న వారిని తక్షణమే అలర్జీ నిపుణుల వద్దకు పంపాలి.
దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలి.
దేశవ్యాప్తంగా యీస్ట్ అలర్జీపై లోతైన అధ్యయనాలు జరపాలి.
కోవిడ్ సమయంలో తలెత్తిన ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ కోరింది.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..The ‘3-F’ Formula for Digestive Health : గట్ హెల్త్ బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం.. వైద్యనిపుణులు చెబుతున్న రహస్యాలివే!
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
