Ignoring Snoring Can Be Dangerous : గురకను గమనించకపోతే.. ప్రాణాలకే ప్రమాదం..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఈ మధ్య కాలంలో చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. నిద్రకు సంబంధించి సమాజంలో ఉన్న కొన్ని సాధారణ అపోహలు మనిషి జీవితకాలాన్ని తగ్గించే ప్రమాదం ఉందని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మూడు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. గురకను చాలామంది గాఢనిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ, అది 'అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా' (OSA) అనే తీవ్రమైన సమస్యకు లక్షణం కావచ్చు.

 

ఇది కూడా చదవండి..150 Minutes of Exercise a Week: దీర్ఘాయువుకు వారానికి 150 నిమిషాల వ్యాయామం దివ్యౌషధం..!

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

 

 గురక గమనించకపోతే.. 

గురకను చాలామంది గాఢనిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ, అది 'అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా' (OSA) అనే తీవ్రమైన సమస్యకు లక్షణం కావచ్చు. ఈ స్థితిలో నిద్రలో శ్వాస పదేపదే ఆగిపోతుంటుంది. దీనివల్ల రక్తపోటు పెరగడమే కాకుండా.. స్ట్రోక్, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పగటిపూట విపరీతమైన నిద్ర రావడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ముప్పు కూడా ఉంది.

 వయసు పెరిగినా విశ్రాంతి అవసరమే..

వృద్ధులకు తక్కువ నిద్ర సరిపోతుందనేది మరో పెద్ద అపోహ. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ కనీసం 7 గంటల నిద్ర అవసరం. వృద్ధుల్లో నిద్ర లేమి అనేది కేవలం అలసటకే కాదు.. డిప్రెషన్, అల్జీమర్స్ వంటి మానసిక వ్యాధులకు ముందస్తు సంకేతం కావచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 మద్యం నిద్రను దూరం చేస్తుంది..

మద్యం సేవించడం వల్ల త్వరగా నిద్ర పడుతుందని కొందరు నమ్ముతారు. కానీ, మద్యం వల్ల వచ్చే నిద్ర నాణ్యమైనది కాదు. ఇది గాఢ నిద్రకు ఆటంకం కలిగించి, రాత్రివేళ పదేపదే మెలకువ వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా గురక, స్లీప్ అప్నియా వంటి సమస్యలను ఇది మరింత జటిలం చేస్తుంది. మెదడు, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రశాంతమైన నిద్ర అత్యవసరం. నిద్రలో ఇబ్బందులు తలెత్తితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.