Immune system: రోగ నిరోధక శక్తి తగ్గితే కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి..?

షేర్ చేయండి:
Immune system: రోగ నిరోధక శక్తి తగ్గితే కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి..?

సాక్షి లైఫ్ : బ్యాక్టీరియా వైరస్‌ల కారణంగా మనకు అనేక జబ్బులు వస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. అయితే వీటి నుంచి కాపాడేందుకు శరీరంలో చాలా ఏర్పాట్లే ఉన్నాయి. శరీరంలోకి చొచ్చుకొచ్చిన రోగకారక సూక్ష్మజీవులను గుర్తించడం మొదలుకొని వాటిని నాశనం చేసే వరకూ అన్ని రకాల చర్యలు రోగ నిరోధక వ్యవస్థ తీసుకుంటుంది. ఇందుకోసం ఇందులో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గితే అనేక రుగ్మతల బారిన పడాల్సి వస్తుంది. అంతేకాదు ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థ తగ్గడం ఆరోగ్యానికి చేటు అన్న విషయం ఇప్పటికే అనేక పరిశోధనల్లో సైతం వెల్లడైంది.

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు ఎంతబాగా ఉంటే అంతబాగా మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. ఇన్ఫెక‌్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. బయటపడేందుకూ వీలుంటుంది. అయితే రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడేందుకు తగిన పోషకాహారం తీసుకోకపోవడం కూడా కారణమవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడటాన్ని ఎలా గుర్తించాలి..?  ఎలాంటి లక్షణాలు క‌నిపిస్తాయయో చూద్దామా?

అల‌స‌ట‌గా.. 

రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటే ఎప్పుడూ అల‌స‌ట‌గా అనిపిస్తుంది. ఏ ప‌నిచేయాలన్నా నీరసంగా ఉంటుంది. చాలా నీరసంగా ఉండడంవల్ల బ‌ద్ద‌కం పెరుగుతుంది. ఉత్సాహం త‌గ్గుతుంది. తరచూ ఆరోగ్య సమస్యల బారిన పడుతూంటాం. 

ఇన్‌ఫెక్ష‌న్లు.. 

అలాగే త‌ర‌చూ ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తుంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారిలో ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. అలాగే త‌ర‌చూ జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. గాయాలు అంత త్వ‌ర‌గా మానుతాయి. గాయాలు, పుండ్లు మానేందుకు చాలా సమయం పడుతుంది. ఇవ‌న్నీ రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలే. 

కొన్ని ఆహారాలు.. 

 కొన్ని రకాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..? ఆహారంలో ప‌సుపు, మిరియాలు, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు వంటి దినుసుల‌ను చేర్చుకోవాలి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే "ఏ", "సి", "డి", "ఇ" విట‌మిన్లు అధికంగా ఉండే  ఆహారాల‌ను తీసుకోవాలి.

పొద్దు తిరుగుడు విత్త‌నాలు.. 

 క్యారెట్లు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, చియా సీడ్స్‌, అవిసె గింజ‌లు, బాదంప‌ప్పు, జీడిప‌ప్పు, పిస్తా, వాల్ న‌ట్స్‌, కోడిగుడ్లు, చికెన్‌, మ‌ట‌న్‌, పాల‌కూర‌.. త‌దిత‌ర ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి  పెరుగుతుంది. తగిన పోషకాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు.

 శరీరంలో ఇమ్యూనిటీ తగ్గితే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, ఇన్‌ఫెక్ష‌న్లతోపాటు చర్మం రంగుమారడం అనేవి కనిపించకపోతే రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగింద‌ని అర్థం చేసుకోవాలి. ఇలా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకుంటే ఎలాంటి వ్యాధుల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా, ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

 

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.