యువతలో బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? 

షేర్ చేయండి:
యువతలో బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? 

సాక్షి లైఫ్ : ఇటీవల కాలంలో యువతలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు మెదడు సంబంధిత వ్యాధులు కేవలం వృద్ధాప్యంలో మాత్రమే వచ్చేవి. అవి వయస్సు పైబడేకొద్దీ వచ్చే సమస్యలుగానే పరిగణించేవాళ్లు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మెదడులో.. 

మెదడులో రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఏర్పడే ఈ సమస్య ను పక్షవాతం అని,పెరాలసిస్ అని కూడా అంటారు. కొన్ని సందర్భాల్లో ఈ జబ్బు కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. 

ఆందోళన కారణంగానే కాకుండా యువతలో పక్షవాతం ముప్పు పెరుగుతోందని, అందుకు ధూమపానం,మద్యం, మధుమేహం వంటి మూడు ప్రధాన కారణాలుగా మారాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. 

స్ట్రోక్‌ ప్రమాదం.. 

ఏ వయసు వారైనా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని, ప్రజలందరూ దాని బారీ నుంచి తమను తాము రక్షించుకోవడం అవసరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

 ముఖ్యంగా  జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు కూడా బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమని, నరాల సమస్యలు కూడా అనేక రకాల సమస్యలను పెంచుతాయని వైద్యులు అంటున్నారు. దీని కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం నివారణ చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

యువకులలో..  

 స్ట్రోక్‌కు సంబంధించిన కొన్ని ప్రమాద కారకాలు వృద్ధుల కంటే భిన్నంగా ఉండవచ్చు. ధూమపానం,మద్య పానం, మధుమేహం, అధిక రక్తపోటు, పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిల కారణంగా స్ట్రోక్ ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని డాక్టర్స్ చెబుతున్నారు. స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే కొన్ని అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు కూడా ఉన్నాయని,  దురదృష్టవశాత్తూ యువతలో ఈ ప్రమాదం మరింత వేగంగా పెరుగుతోందని వైద్యలు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.