ఇండియన్ టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్.. ఏది బెస్ట్..?
సాక్షి లైఫ్ : ఈ రోజుల్లో వెస్ట్రన్ టాయిలెట్ల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ప్రజలు తమ సౌలభ్యం కోసం, వారి ఇంటిని లేటెస్ట్ మోడల్ హౌస్ లా ఉందని చూపించుకు నేందుకు వెస్ట్రన్ టాయిలెట్లను ఉపయో గిస్తున్నారు. చాలా మంది ప్రజలు ఇవి మంచివని నమ్ముతారు. కొందరు భారతీయ మరుగుదొడ్లు మంచివని భావిస్తారు. భారతీయ, పాశ్చాత్య మరుగుదొడ్లలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. వేసవిలో వచ్చే ఈ హెల్తీ ఫ్రూట్స్ అస్సలు మిస్ అవ్వకండి..
జీవనశైలిలో భాగంగా..
ఈ రోజుల్లో ప్రజల జీవన విధానం చాలా మారిపోయింది. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి, మనం మన జీవనశైలిలో అనేక విషయాలను మార్చుకుంటున్నాము. దీంతో ఇవి మన ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపిస్తున్నాయి. అటువంటి వాటిల్లో పాశ్చాత్య మరుగుదొడ్లు ఒకటి. ఇవి ఈ రోజుల్లో చాలా మంది ప్రజల జీవనశైలిలో భాగంగా మారాయి. ప్రస్తుతం చాలా మంది వెస్ట్రన్ టాయిలెట్లను ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా భారతీయ టాయిలెట్ల ట్రెండ్ తగ్గుతోంది.
భారతీయ మరుగుదొడ్లు..
భారతీయ మరుగుదొడ్లు ఫిట్‌గా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాశ్చాత్య మరుగుదొడ్ల కంటే ఇండియన్ టాయిలెట్లు మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడంలో మరింత సహాయపడతాయి. నిజానికి, భారతీయ శైలి టాయిలెట్లపై కూర్చోవడం మీ శరీరానికి వ్యాయామం వలే పనిచేస్తుంది. ఇలా కూర్చోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
రక్త ప్రసరణ..
మీరు భారతీయ టాయిలెట్‌లో కూర్చున్న విధానం మీ రక్త ప్రసరణను పెంచుతుంది. మీ చేతులు,కాళ్ళకు మంచి ఎక్సర్ సైజ్ లా పని చేస్తుంది
పాశ్చాత్య మరుగుదొడ్ల కంటే భారతీయ టాయిలెట్లు పర్యావరణ అనుకూలమైనవి. వాస్తవానికి కొన్నిపాశ్చాత్య మరుగుదొడ్లలో పేపర్ ఉపయోగిస్తారు. కొన్నిరకాల వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్లకు ఎక్కువ నీరు అవసరం. ఈ రెండిటి విషయంలో భారతీయ మరుగుదొడ్లు చాలా మెరుగ్గా ఉంటాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..
భారతీయ టాయిలెట్‌లో కూర్చోవడం వల్ల మీ పొట్ట కుదించుకుపోతుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. దీనికి విరుద్ధంగా, పాశ్చాత్య స్టైల్ టాయిలెట్‌లో కూర్చోవడం వల్ల మన కడుపుపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. కొన్నిసార్లు విసర్జన కూడా సరిగ్గా అవ్వదు.
గర్భిణీ స్త్రీలకు మంచిది..
భారతీయ స్టైల్ టాయిలెట్లు గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే భారతీయ టాయిలెట్లను ఉపయోగించడానికి, వారు స్క్వాట్ పొజిషన్‌లో కూర్చోవాలి, ఇది సాఫీగా, సహజ ప్రసవానికి సహాయపడుతుంది. అలాగే దీని వాడకం వల్ల గర్భాశయంపై ఎలాంటి ఒత్తిడి ఉండదు.
క్యాన్సర్ నుంచి రక్షణ
ఇండియన్ టాయిలెట్‌లో స్క్వాట్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల మన శరీరంలోని పెద్దప్రేగు నుంచి మలాన్ని పూర్తిగా బయటకు పంపుతుంది. ఇది మలబద్ధకం, అపెండిసైటిస్, పెద్దప్రేగు క్యాన్సర్‌కు దారితీసే ఇతర కారకాలను నివారిస్తుంది.
ఇది కూడా చదవండి.. మీరు తాగే నీరు స్వచ్ఛమైనదా కాదా..? ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
