సాక్షి లైఫ్ : ప్రపంచంలోని 70 శాతం నీరు ఉన్నప్పటికీ, అందులో కేవలం మూడు శాతం నీరు మాత్రమే తాగడానికి ఉపయోగపడేది. ఆరోగ్యంగా ఉండాలంటే మనం తాగేనీరు కూడా స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 22ను ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజును జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే..? నీటి ప్రాముఖ్యతను గురించి ప్రజలకు తెలియజేయడమే.1993 సంవత్సరం నుంచి ప్రపంచ నీటి దినోత్సవం జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి.. సెలెబ్రెటీలు వేడి నీళ్లు ఎందుకు తాగుతారో తెలుసా..?
నేడు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా..
మనుషులకు, జంతువులకు, చెట్లకు, మొక్కలకు నీరు చాలా ముఖ్యమైన వనరు. ప్రతి జీవి ఆహారం లేకుండా కొన్నిరోజులు జీవించగలదు, కానీ నీరు లేకుండా జీవితాన్ని ఊహించలేము. కంటి చూపుకి స్పష్టంగా కనిపించిన నీరు తాగవచ్చని ఖచ్చితంగా చెప్పలేం. అందులో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఇంట్లోనే కొన్నిరకాల పద్ధతులను ఉపయోగించడం ద్వారా మీరు తాగే నీరు మీ ఆరోగ్యానికి మంచిదా..? కాదా..? అనేది తనిఖీ చేయవచ్చు.
తాగే నీరు స్వచ్ఛమైనదా కాదా..? అని ఎలా తెలుసుకోవాలి..?
టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ (టీడీఎస్) లెవెల్..
నీటి నాణ్యతను నిర్ణయించడంలో ముఖ్యమైన అంశం టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ (టీడీఎస్) స్థాయి. ఇది నీటిలో కరిగిన పదార్ధాల మొత్తం సాంద్రతను సూచిస్తుంది. ఇంట్లో టీడీఎస్ స్థాయిని తనిఖీ చేయడం ద్వారా, నీటి నాణ్యతను సులభంగా, సమర్ధవంతంగా అంచనా వేయవచ్చు. దాని వినియోగానికి సంబంధించి సమాచారం తెలుసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో నీటి టీడీఎస్ స్థాయిని ఎలా తనిఖీ చేయాలి..? అంటే..?
నీటి స్వచ్ఛతను తనిఖీ చేయడానికి టీడీఎస్ ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా నీరు తాగడానికి పనికివస్తుందా..? లేదా అనేది నిర్ధారిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, నీటి టీడీఎస్ స్థాయి 100 నుంచి 250 పిపిఎమ్ (పార్ట్స్ పర్ మిలియన్) ఉండాలి. ఇలాంటి నీరు తాగడానికి సురక్షితమైనవి. అయితే, టీడీఎస్ పరిమాణం దీని కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉంటే, తాగడానికి పనికిరాదని అర్థం.
టీడీఎస్ ని ఇలా చెక్ చేయండి..
టీడీఎస్ తనిఖీ చేయడానికి థర్మామీటర్‌ను పోలి ఉండే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఒక గ్లాసులో నీటిని తీసుకుని, ఈ పరికరం ముందు భాగాన్ని నీటిలో ఒక నిమిషం పాటు ఉంచండి. పరికరంలో నీటి టీడీఎస్ ఆ పరికరం స్క్రీన్ పై కనిపిస్తుంది.
pH లెవల్స్..
ప్రొటెన్సియల్ ఆఫ్ హైడ్రోజన్ .. దీనినే పీహెచ్ (pH) అని అంటారు. నీరు ఎంత గట్టిగా లేదా మృదువుగా ఉందో pH స్థాయి చూపిస్తుంది. pH 7 అంటే స్వచ్ఛమైన నీరు. నీటి pH స్థాయి 7 కంటే తక్కువగా ఉంటే, దానిని హార్డ్ వాటర్‌గా పరిగణిస్తారు. దీనిని ఆమ్ల జలం అంటారు. నీటి pH స్థాయి 7 కంటే ఎక్కువ ఉంటే దానిని ఆల్కలీన్ వాటర్ అంటారు. తాగునీటిలో pH స్థాయి 7 నుంచి 8 మధ్య ఉంటే మంచిది.
ఇంట్లో pH స్థాయిని ఎలా తనిఖీ చేయాలి..?
నీటి pH విలువను తనిఖీ చేయడానికి, TDSని తనిఖీ చేయడానికి ఇదే పరికరం ఉపయోగించబడుతుంది. పరికరం pH విలువ కనిపించే ప్రదర్శనను కలిగి ఉంది.
ఓఆర్పీ లెవల్..
ఆక్సీకరణ-తగ్గింపు సంభావ్యత (ORP) అనేది ఒక సరస్సు లేదా నది తనంతట తానుగా శుభ్రపరచుకోవడం లేదా కలుషితాలు, చనిపోయిన మొక్కలు, జంతువులు వంటి వ్యర్థ ఉత్పత్తులను విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కొలుస్తుంది. ఓఆర్పీ విలువ ఎక్కువగా ఉన్నప్పుడు, నీటిలో ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది.
ఆక్సిడేషన్ రిడక్షన్ ప్రొటెన్సియల్(ఓఆర్పీ) అంటే ఆక్సీకరణ తగ్గింపు సంభావ్యత, నీటిలో ORP మొత్తం ప్రతికూల 1500 (-1500) mV నుండి ప్లస్ 1500 (+1500) mV వరకు ఉంటుంది. ORP ఎంత మైనస్ లో ఉంటే నీరు శుభ్రంగా ఉన్నట్లు పరిగణిస్తారు. ఒక ప్రదేశంలో నీటి ORP -400 mV ఉంటే, ఆ నీరు చాలా శుభ్రంగా ఉన్నట్లు లెక్క. అయితే ORP +400 ఉంటే అది తాగడానికి పనికిరాదు. ORP -400 mV నుంచి -200 mV మధ్యలో ఉంటే తాగవచ్చని పరిగణిస్తారు.
ఓఆర్పీని ఎలా తనిఖీ చేయాలంటే..?
నీటి ఓఆర్పీ విలువను తనిఖీ చేయడానికి, టీడీఎస్ ను తనిఖీ చేయడానికి ఒకే పరికరం ఉపయోగిస్తారు. ఇదే పరికరం ద్వారా నీటిలో ఈ రెండిటి స్థాయిలను తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి.. గట్ హెల్త్ ను పెంపొందించే తమలపాకు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com