Is It Safe to Use the Same Shampoo : ఒకే బ్రాండ్ షాంపూ ఎక్కువ కాలం వాడకూడదా..?
సాక్షి లైఫ్ : ఆధునిక జీవనంలో అనేక మార్పులు వచ్చాయి. అటువంటివాటిలో తలస్నానం చేసేటప్పుడు ఉపయోగించే కుంకుడు కాయల స్థానంలో షాంపూలు వచ్చి చేరాయి. అయితే తలస్నానానికి వాడే షాంపూల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని లేకపోతే పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. సంవత్సరాలుగా ఒకే షాంపూ ఉపయోగిస్తున్నారా..? ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి..
ఏదైనా ఒక బ్రాండ్ షాంపూ బాగుంది అనుకుంటే.. కొంతమంది దానిని కొన్ని సంవత్సరాలుగా ఉపయోగిస్తూనే ఉంటారు. చాలామంది ఆయా బ్రాండ్ ను మార్చడానికి భయపడతారు. కానీ ఒకేరకమైన షాంపూను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల జుట్టుకు హాని కలుగుతుందని మీకు తెలుసా..? దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఋతువులను బట్టి జుట్టు అవసరాలు మారుతాయి. వాతావరణం మారినప్పుడు మనం వేసుకునే బట్టలు మార్చుకున్నట్లే, మన జుట్టు అవసరాలూ అదేవిధంగా మారుతాయి. వేసవి కాలంలో చెమట, దుమ్ము, ధూళి హెయిర్ ని జిడ్డుగా మారుస్తాయి. ఇలాంటి సమయంలో డీప్ క్లెన్సింగ్ షాంపూ అవసరం ఉంటుంది. అదే వింటర్ సీజన్ లో అయితే జుట్టు పొడిగా మారడమేకాకుండా నిర్జీవంగా అవుతుంది. కాబట్టి దీనిని పరిష్కరించడానికి మాయిశ్చరైజింగ్ షాంపూ అవసరం. ఏడాది పొడవునా ఒకే షాంపూని ఉపయోగించడం వల్ల జుట్టు దెబ్బతింటుంది.
షాంపూ 'బిల్డ్-అప్'..
ఒకప్పుడు జుట్టును సిల్కీగా చేసిన షాంపూ ఇప్పుడు వాష్ చేసిన తర్వాత కూడా జిగటగా లేదా బరువుగా అనిపిస్తుందనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? నిజానికి, చాలా షాంపూలు, కండిషనర్లలో సిలికాన్ వంటి పదార్థాలు ఉంటాయి, ఇవి జుట్టుపై పేరుకుపోతాయి.
ఒకే బ్రాండ్ కు చెందిన షాంపూలని ఎక్కువరోజులు ఉపయోగించడం వల్ల ఈ పొర దెబ్బతింటుంది. దీనినే 'ప్రొడక్ట్ బిల్డప్' అని పిలుస్తారు. జుట్టు మూలాలు సరిగా లేకపోవడం కారణంగా హెయిర్ ఫాల్ సమస్య మొదలవుతుంది. షాంపూని మార్చడం వల్ల ఈ సమస్య తొలగిపోతుంది.
వయస్సు, జీవనశైలి ప్రభావం..
వయస్సు, ఆహారం, హార్మోన్ల మార్పులు మన జుట్టును నేరుగా ప్రభావితం చేస్తాయి. రెండు సంవత్సరాల క్రితం మందంగా, హెల్తీగా ఉన్న మీ జుట్టు.. ఇప్పుడు సన్నగా, పొడిగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒకే షాంపూ వాడకూడదు. ఖచ్చితంగా మార్చాల్సిందేనని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. గతకొన్నేళ్లుగా వాడుతున్న షాంపూ ఇప్పుడు జుట్టుకు ఉపయోగ పడకపోవచ్చు. జుట్టు ఆకృతి మారినప్పుడు,షాంపూ కూడా మారాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
షాంపూ ఎప్పుడు మార్చాలి మరి..?
షాంపూ అయిపోయిన ప్రతిసారీ కొత్త బ్రాండ్ షాంపూ కొనాల్సిన అవసరం లేదు, కానీ జుట్టు సంకేతాలను గుర్తించడం ముఖ్యం. ఒకవేళ జుట్టు దురద పెట్టినా, చిక్కుకుపోయినా.. వాష్ చేసిన తర్వాత కూడా గతంలో లాగా మెరుపును కోల్పోయినాతప్పనిసరిగా షాంపూ మార్చాలి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, షాంపూను తరచుగా మార్చడం ఉత్తమం. అది కూడా సంవత్సరానికి కనీసం 2 లేదా 3 సార్లు షాంపూను మార్చాలని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
