Fatty liver and insulin resistance : ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు ఏమైనా లింక్ ఉందా..?
సాక్షి లైఫ్ : ప్రస్తుత జీవనశైలిలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో ఫ్యాటీ లివర్ (Fatty Liver Disease) ఒకటి. కాలేయంలో కొవ్వు (Fat) పేరుకుపోవడాన్నే ఫ్యాటీ లివర్ వ్యాధిగా భావిస్తారు. అయితే, ఈ ఫ్యాటీ లివర్ సమస్యకు, "ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance)"కు చాలా దగ్గరి సంబంధం ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ రెండూ ఒకదానికొకటి కారణమవుతూ.. మధుమేహం (Diabetes), గుండె జబ్బుల (Heart Disease) వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని వారు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
మంచి విషయం ఏమిటంటే..? రక్త పరీక్షల (Blood Tests) ద్వారా నిర్ధారణ అయ్యే కంటే ముందే, మీ శరీరంలో కొన్ని భౌతిక సంకేతాల (Physical Signs) ద్వారా ఈ ముప్పును గుర్తించవచ్చు.
ఫ్యాటీ లివర్ - ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు కారణమేంటి..?
కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు, అది ఇన్సులిన్‌కు సరిగా స్పందించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీనినే ఇన్సులిన్ నిరోధకత అంటారు. ఇన్సులిన్ సరిగా పనిచేయకపోతే, రక్తంలో చక్కెర (Glucose) స్థాయిలు పెరుగుతాయి. దాంతో, శరీరం మరింత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అధిక ఇన్సులిన్ మళ్లీ కాలేయంలో మరింత కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఈ విధంగా, ఫ్యాటీ లివర్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకదానినొకటి పెంచుకుంటూ ఆరోగ్యానికి ప్రమాదకరమైన "మెటబాలిక్ సిండ్రోమ్ (Metabolic Syndrome)"కు దారితీస్తాయి.
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
ఇది కూడా చదవండి..జికా వైరస్ డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుందా..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
