Uric Acid : యూరిక్ యాసిడ్ పెరుగుతోందా..? ఐతే ఈ తీవ్రమైన సమస్యలు పొంచి ఉన్నట్లే.. అదుపు చేయడం ఎలా అంటే..?
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం వల్ల ఈ రోజుల్లో 'యూరిక్ యాసిడ్' పెరగడం అనేది సర్వసాధారణమైన ఆరోగ్య సమస్యగా మారింది. ప్రారంభంలో దీని లక్షణాలు పెద్దగా కనిపించకపోయినా.. నిర్లక్ష్యం చేస్తే మాత్రం కీళ్లు, కిడ్నీలతో పాటు మొత్తం శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలోని 'ప్యూరిన్' (Purine) అనే రసాయనం విచ్ఛిన్నమైనప్పుడు శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థమే ఈ యూరిక్ యాసిడ్. సాధారణంగా ఇది మూత్రపిండాల ద్వారా వడపోయబడి, మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది.
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..?
మనం తీసుకునే ఆహారంలోని 'ప్యూరిన్' (Purine) అనే రసాయనం విచ్ఛిన్నమైనప్పుడు శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థమే ఈ యూరిక్ యాసిడ్. సాధారణంగా ఇది మూత్రపిండాల ద్వారా వడపోయబడి, మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది. కానీ, శరీరంలో దీని ఉత్పత్తి మోతాదు మించినప్పుడు లేదా కిడ్నీలు దీనిని సరిగ్గా బయటకు పంపలేకపోయినప్పుడు రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.
యూరిక్ యాసిడ్ పెరిగితే వచ్చే ప్రధాన సమస్యలు..?
కీళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు: యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు దాని ప్రభావం ముందుగా కీళ్లపైనే పడుతుంది. ఇవి స్ఫటికాల్లా (crystals) మారి కీళ్ల మధ్యలో పేరుకుపోతాయి. ముఖ్యంగా కాలి బొటనవేలు, మోకాలు, చీలమండల వద్ద తీవ్రమైన నొప్పి, వాపు, ఎరుపుదనం వస్తాయి.
గౌట్ (Gout) ముప్పు..
రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయులు ఎక్కువ కాలం పాటు అలాగే ఉంటే అది 'గౌట్' అనే కీళ్ల వ్యాధికి దారితీస్తుంది. దీనివల్ల భరించలేని నొప్పితో పాటు నడవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కీళ్లు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
కిడ్నీలో రాళ్లు..
ఈ వ్యర్థాలు మోతాదుకు మించి పేరుకుపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఫలితంగా నడుంనొప్పి, మూత్ర విసర్జన సమయంలో మంట, మూత్రంలో రక్తం పడటం వంటి సమస్యలు ఎదురవుతాయి.
మూత్రపిండాల పనితీరుపై ప్రభావం..
యూరిక్ యాసిడ్ స్థాయిలు దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంటే కిడ్నీలపై అదనపు భారం పడుతుంది. ఇది కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని దెబ్బతీసి, తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తుంది.
గుండె, జీవక్రియ సమస్యలు..
అధిక యూరిక్ యాసిడ్ కేవలం కీళ్ల సమస్య మాత్రమే కాదు. దీనివల్ల అధిక రక్తపోటు (bp), ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
అదుపులో ఉంచుకోవడం ఎలా..?
నీళ్లు బాగా తాగాలి: రోజులో తగినన్ని నీళ్లు తాగడం వల్ల యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా సులభంగా బయటకు వెళ్లిపోతుంది.
ప్యూరిన్ ఆహారాలకు దూరం: రెడ్ మీట్, ఆర్గాన్ మీట్, కొన్ని రకాల సీ-ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగాన్ని బాగా తగ్గించాలి.
పండ్లు, కూరగాయలు..
తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు నియంత్రణ: అధిక బరువు కూడా యూరిక్ యాసిడ్ పెరగడానికి ఒక కారణం. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలి. మద్యం, తీపి పానీయాలకు చెక్: చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలు, ఆల్కహాల్ వంటివి యూరిక్ యాసిడ్ స్థాయిలను అమాంతం పెంచుతాయి. వీటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
ఎవరు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి..?
ఊబకాయం సమస్యతో బాధపడేవారు.
ఇప్పటికే గౌట్ లేదా కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు.
మధుమేహం ( diabetes), అధిక రక్తపోటు (hypertension) ఉన్న రోగులు.
కుటుంబంలో అధిక యూరిక్ యాసిడ్ సమస్య (family history) ఉన్నవారు.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
