30 నిమిషాల్లో 10 రెట్లు ఆరోగ్యప్రయోజనాలిచ్చే 'జపనీస్ వాకింగ్' టెక్నిక్..!
సాక్షి లైఫ్ : రోజుకు పదివేల అడుగులు నడవాలనే లక్ష్యం చాలామందికి సవాలుగా అనిపిస్తుంది. పని ఒత్తిడి, సమయం లేకపోవడం, కీళ్ల సమస్యలు వంటి కారణాలతో ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారా? అయితే మీకు శుభవార్త! జపాన్ పరిశోధకులు అభివృద్ధి చేసిన ఒక వినూత్న నడక పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ 30 నిమిషాల 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' ద్వారా 10వేల అడుగుల నడక కంటే పది రెట్లు ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..వెన్నునొప్పికి తక్షణ ఉపశమనం కోసం యోగాసనాలు ఎలా సహాయపడతాయి..?
ఇది కూడా చదవండి..హెల్తీ మిసో సూప్ తయారు చేయడానికి ఏమేం అవసరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఏమిటీ 'జపనీస్ వాకింగ్ టెక్నిక్' (ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్)..అంటే..?
ఈ పద్ధతిని 'ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్' (ఐ డబ్ల్యూటీ) అని కూడా పిలుస్తారు. ఇది సాధారణ నడకకు భిన్నంగా ఉంటుంది. దీనిలో నెమ్మదిగా నడవడం, వేగంగా నడవడం అనే రెండు దశలను ఆల్టర్నేట్‌గా చేస్తారు.
ఈ పద్ధతి ప్రకారం..
ముందుగా 3-5 నిమిషాల పాటు సాధారణ వేగంతో వార్మ్-అప్ చేయాలి. ఆ తర్వాత, 3 నిమిషాల పాటు వేగంగా (బ్రిస్క్ వాక్) నడవాలి. మీరు ఒక ముఖ్యమైన మీటింగ్‌కు వెళ్తున్నట్లుగా వేగంగా, కొద్దిగా శ్వాస పీల్చుకుంటూ మాట్లాడగలిగేంత వేగంగా ఉండాలి.
తరువాత, 3 నిమిషాల పాటు నెమ్మదిగా నడవాలి. ఇది రికవరీ సమయం. ఈ '3 నిమిషాల వేగవంతమైన నడక - 3 నిమిషాల నెమ్మది నడక' సైకిల్‌ను కనీసం 5 సార్లు పునరావృతం చేయాలి. ఇది మొత్తం 30 నిమిషాల సమయం పడుతుంది. చివరగా 3-5 నిమిషాల కూల్ డౌన్ నడకతో ముగించాలి.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
