సాక్షి లైఫ్ : చాలామంది ప్రోబయోటిక్ టాబ్లెట్లు, ఖరీదైన డ్రింక్స్‌పై డబ్బులు కుమ్మరిస్తుంటారు. కానీ, మన వంటింట్లో లభించే సాధారణ పదార్థాలతోనే జీర్ణవ్యవస్థను పదిలం చేసుకోవచ్చని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పెరుగు అందరికీ అందుబాటులో ఉండే గొప్ప ప్రోబయోటిక్. ఇందులో ఉండే 'లైవ్ అండ్ యాక్టివ్ కల్చర్స్' హానికర బ్యాక్టీరియాను తరిమికొట్టి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మన కూరల్లో వాడే వెల్లుల్లిలో 'ఇనులిన్' అనే ఫైబర్ ఉంటుంది. ఇది మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా (Prebiotic) పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
అల్లం జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.అరటిపండు, ఆపిల్ లో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ పేగుల గోడలను బలంగా ఉంచుతుంది. రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లక్కర్లేదన్న మాట గట్ విషయంలోనూ నిజమేమరి..
పప్పు ధాన్యాలలో ఉండే ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల్లోని సూక్ష్మజీవులకు ఇంధనంగా పనిచేస్తాయి. ఉదయాన్నే ఓట్స్ తీసుకోవడం వల్ల అందులోని 'బీటా-గ్లూకాన్' పేగుల్లో మంటను (Inflammation) తగ్గించి, జీర్ణక్రియను సాఫీగా చేస్తుంది.
సప్లిమెంట్లు వర్సెస్ సహజ ఆహారం: ఏది మిన్న..?
| ఫీచర్ | సప్లిమెంట్లు (మాత్రలు) | వంటింటి ఆహారం |
| పోషకాలు | కేవలం ఒకటి లేదా రెండు రకాల బ్యాక్టీరియా | విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో కూడిన పూర్తి ఆహారం |
| ఖర్చు | చాలా ఎక్కువ | చాలా తక్కువ |
| శరీర శోషణ | తక్కువ (కృత్రిమమైనవి కాబట్టి) | అధికం (సహజ సిద్ధంగా జీర్ణమవుతాయి) |
| దుష్ప్రభావాలు | అతిగా వాడితే ఇన్ఫెక్షన్ల భయం | సురక్షితం, రుచికరం |
ఇడ్లీ, దోశ పిండి వంటి పులియబెట్టిన పదార్థాల్లో సహజమైన ప్రోబయోటిక్స్ ఉంటాయి. వీటిని మీ డైట్‌లో భాగం చేసుకోండి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు అది సరిగ్గా పని చేయాలంటే తగినంత నీరు తాగడం ముఖ్యం. ప్యాక్ చేసిన స్నాక్స్, అతిగా చక్కెర ఉన్న పదార్థాలు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను చంపేస్తాయి.
ఆరోగ్యం ప్లేటులో ఉండాలి కానీ మాత్రల్లో కాదు. ఖరీదైన సప్లిమెంట్ల వెంట పరిగెత్తే కంటే, మన అమ్మమ్మల కాలం నాటి వంటింటి ఆహారపు అలవాట్లను పాటిస్తే జీర్ణకోశ సమస్యలు దరిచేరవు. మీ గట్ ఆరోగ్యంగా ఉంటే, మీ రోగనిరోధక శక్తి కూడా రెట్టింపు అవుతుంది.
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com