Longevity Diet : దీర్ఘాయువు పెంచే రహస్యం ఇదే..
సాక్షి లైఫ్ : ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతికేందుకు ఏదో కొత్త మందు ఏమీ అవసరం లేదు. మనం రోజూ తినే పప్పులు, ముడి ధాన్యాలే మనకు ఆరోగ్యాన్నీ, ఆయువునీ పెంచుతాయని చెబుతున్నారు వైద్యనిపుణులు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వందేళ్లకు పైగా జీవించే ప్రజలు ఉన్న 'బ్లూ జోన్స్' (Blue Zones) లో అనుసరించే ఆహారపు అలవాట్లు మనకూ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. వాళ్లు అనుసరించే హ్యాబిట్స్ ఏమిటి..?వాళ్లు తీసుకునే డైట్ ప్రత్యేకత ఏమిటి..? అది ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
మొక్కల ఆధారిత ఆహారానికే ప్రాధాన్యం..
మనం తీసుకునే ఆహారంలో 90 నుంచి 95శాతం వరకూ మొక్కల నుంచి వచ్చేవే ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవాలి. చిక్కుడు జాతి గింజలు (Beans), పెసలు, శనగలు, కందులు వంటివి రోజూ కనీసం ఒక కప్పు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రొటీన్ అందుతాయి. పాలిష్ పట్టని బియ్యం, జొన్నలు, రాగులు, ఓట్స్ వంటి ముడి ధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, గుండెను పదిలంగా ఉంచుతాయి.
రోజుకు ఒక గుప్పెడు బాదం, వాల్‌నట్స్ వంటివి తింటే గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు (Dementia), అల్జీమర్స్ వంటి సమస్యలను నిరోధించడానికి 'మైండ్ డైట్' అద్భుతంగా పనిచేస్తుంది.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాల క్షీణతను అడ్డుకుంటాయి. వారానికి కనీసం ఒకసారి చేపలు తీసుకోవడం వల్ల మెదడుకు కావాల్సిన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. 80శాతం నియమం పాటించాలి.. కడుపు నిండా తినకుండా, 80 శాతం నిండినప్పుడే భోజనం ఆపేయాలి. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. రాత్రి భోజనానికి, ఉదయం అల్పాహారానికి మధ్య కనీసం 12-14 గంటల విరామం ఉండేలా చూసుకోవాలి.
తీపి పదార్థాలు, సోడాలు, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్ ఆయుష్షును తగ్గిస్తాయి. దీర్ఘాయువు అనేది కేవలం జన్యువులపైనే ఆధారపడి లేదు, మన ప్లేటులో మనం తినే ఆహారంపైనే 75శాతం ఆధారపడి ఉంటుంది. శాకాహారానికి ప్రాధాన్యతఇస్తూ, నడక వంటి వ్యాయామాలను చేస్తే నూరేళ్ల ఆయుష్షు సొంతం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
