AI Detects a Life-Threatening Tumor : వైద్యులు గుర్తించలేకపోయినా ప్రాణాంతకమైన ట్యూమర్ ఉన్నట్లు కనుగొన్న ఏఐ..
సాక్షి లైఫ్ : వైద్యుల కంటపడని క్యాన్సర్ గడ్డలను గుర్తిస్తున్న కృత్రిమ మేధ చైనాలో ముందస్తు నిర్ధారణతో ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు రోగులు. సాధారణంగా ప్యాంక్రియాటిక్ (pancreatic cancer) క్యాన్సర్ అంటేనే వైద్య లోకం వణికిపోతుంది. లక్షణాలు బయటపడేసరికే అది ముదిరిపోయి, ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉంటుంది. అయితే, ఆధునిక సాంకేతికత 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఇప్పుడు ఈ మరణశాసనాన్ని తిరగరాస్తోంది. చైనాలో వైద్యులు గుర్తించలేకపోయిన అత్యంత సూక్ష్మమైన గడ్డలను సైతం ఏఐ విజయవంతంగా పసిగడుతూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతోంది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
స్కాన్ రిపోర్టులో ప్రాణాంతకమైన ట్యూమర్..
తూర్పు చైనాకు చెందిన క్యూ సిజున్ అనే 57 ఏళ్ల వృద్ధుడు తన మధుమేహ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ తీసిన రొటీన్ సీటీ స్కాన్‌ను క్లోమ గ్రంథి విభాగాధిపతి పరిశీలించి ఆయనను అత్యవసరంగా పిలిపించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సిజున్‌కు ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు కనిపించలేదు. కానీ, ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా వాడుతున్న 'పాండా' (PANDA) అనే ఏఐ సాఫ్ట్‌వేర్ ఆయన స్కాన్ రిపోర్టులో ప్రాణాంతకమైన ట్యూమర్ ఉన్నట్లు హెచ్చరించింది. అప్పటికప్పుడు వెంటనే అప్రమత్తమైన వైద్యులు సర్జరీ చేసి దానిని తొలగించారు. అది క్యాన్సర్ తొలి దశ కావడంతో ఆయన ప్రాణాపాయం నుంచి గట్టెక్కగలిగారు.
ఎందుకీ ప్రత్యేకత అంటే..?
సాధారణంగా క్లోమ గ్రంథిని క్షుణ్ణంగా పరిశీలించాలంటే శరీరంలోకి రేడియేషన్ పంపే 'కాంట్రాస్ట్ సీటీ' స్కాన్ అవసరం. అయితే సాధారణ సీటీ స్కాన్లలో చిత్రాలు అంత స్పష్టంగా ఉండవు. చైనా దిగ్గజ సంస్థ 'అలీబాబా' రూపొందించిన ఈ ఏఐ టూల్, మామూలు స్కాన్లలోని అస్పష్టమైన చిత్రాలను కూడా విశ్లేషించి, నిపుణులైన రేడియాలజిస్టులు సైతం గుర్తించలేని మార్పులను పట్టేస్తోంది.
ఇప్పటివరకు సుమారు 1.8 లక్షల స్కాన్లను విశ్లేషించి, రెండు డజన్ల పైగా క్యాన్సర్ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించింది. అమెరికాకు చెందిన ఎఫ్.డి.ఏ (USFDA) సైతం ఈ పరికరానికి 'బ్రేక్‌త్రూ డివైజ్' హోదాను కల్పించింది.
నిపుణుల హెచ్చరిక..
ఈ సాంకేతికత అద్భుతమైనదే అయినా, కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కొన్నిసార్లు సాధారణ వాపును కూడా క్యాన్సర్‌గా తప్పుగా చూపించే (False Positive) ప్రమాదం ఉందని మేయో క్లినిక్ వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల రోగులు అనవసరంగా ఆందోళన చెందడమే కాకుండా, మరిన్ని ఖరీదైన పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది.
కాబట్టి, ఇది నిపుణులైన వైద్యులకు ఒక 'సహాయకారి'గానే పనికివస్తుందని, తుది నిర్ణయం వైద్యులదేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా నిపుణులైన వైద్యుల కొరత ఉన్న ప్రాంతాల్లో ఈ ఏఐ సాంకేతికత ఒక వరంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..Vitamin D Superfoods : విటమిన్ డి సూపర్ ఫుడ్స్: ఈ నాలుగు ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
