Lifestyle Factors : లైఫ్ స్టైల్ ప్రభావంతోనే టీనేజర్లలో హార్ట్ డిసీజెస్.. వైద్యనిపుణుల హెచ్చరిక..
సాక్షి లైఫ్ : ఒకప్పుడు అరవై ఏళ్లు పైబడిన వారిని వేధించే గుండె జబ్బులు.. ఇప్పుడు పదిహేనేళ్ల ప్రాయంలోనే పలకరిస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితం, మితిమీరిన ఒత్తిడి, జంక్ ఫుడ్ సంస్కృతి వెరసి చిన్నారుల గుండెను చిధ్రం చేస్తున్నాయి. పసి హృదయాల మీద పెరుగుతున్న ఈ పెనుముప్పును అరికట్టాలంటే తల్లిదండ్రులు, యువత తక్షణమే మేల్కోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గుండెను పిండేస్తున్న జీవనశైలి..
ఆధునిక పోకడలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ధమనులు మూసుకుపోవడం (Atherosclerosis) వంటి తీవ్రమైన సమస్యలు ఇప్పుడు కౌమార దశలోనే (Adolescence) కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాలు.. ప్యాక్ చేసిన స్నాక్స్, అధిక నూనెలు, మసాలాలతో కూడిన జంక్ ఫుడ్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతున్నాయి. ఇది రక్త నాళాల్లో పేరుకుపోయి రక్త ప్రసరణకు అడ్డంకులు సృష్టిస్తోంది. గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లకే పరిమితమవ్వడం వల్ల శారీరక శ్రమ శూన్యమవుతోంది. విద్యా రంగంలో పోటీ, నిద్రలేమి వంటివి చిన్నారుల గుండెను బలహీనపరుస్తున్నాయి.
ముప్పును సూచించే సంకేతాలివే..
తీవ్ర అలసట..చిన్నపాటి పనికే అలిసిపోవడం. శ్వాసలో ఇబ్బంది.. మెట్లు ఎక్కినా, కాసేపు వేగంగా నడిచినా ఆయాసం రావడం. తరచుగా ఛాతిలో బరువుగా లేదా ఒత్తిడిగా అనిపించడం. రక్తపోటులో మార్పుల వల్ల ఈ లక్షణాలు కనిపించవచ్చు. చిన్న వయసులో వచ్చే రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం ద్వారా పెను ముప్పును ముందే గుర్తించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మాత్రమే గుండెరక్ష. ఒత్తిడిని తగ్గించుకుంటూ, ప్రకృతికి దగ్గరగా గడుపుతూ జీవనశైలిని మార్చుకుంటేనే రేపటి పౌరుల గుండె పదిలంగా ఉంటుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలితోనే..
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి మనం తీసుకునే ఆహారం నుంచి చేసే వ్యాయామం వరకు ప్రతి అంశం కీలకమే. నిత్యం మన భోజనంలో ఆకుకూరలు, తాజా పండ్లు, తృణధాన్యాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా తీపి పానీయాలు, జంక్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండటం ఎంతో అవసరం.
కేవలం ఆహార నియమాలే కాకుండా, ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక, యోగా లేదా క్రీడల్లో పాల్గొనడం వల్ల శరీరానికి కావాల్సిన శారీరక శ్రమ లభిస్తుంది. ఆధునిక కాలంలో పెరిగిపోతున్న స్క్రీన్ టైమ్ అంటే మొబైల్, ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గించి, ఆరుబయట గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వీటన్నింటితో పాటు, శరీరానికి సరైన విశ్రాంతినివ్వడానికి రోజుకు 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర తప్పనిసరి. ఈ చిన్నపాటి మార్పులే గుండె జబ్బుల ముప్పు నుంచి కాపాడుతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
