సాక్షి లైఫ్: నేటి ఆధునిక జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక పోషకాహార లోపాలకు గురవుతున్నాం. ముఖ్యంగా మన ఆహారంలో ఫైబర్ ప్రాముఖ్యతను విస్మరిస్తున్నాం. జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి గుండె ఆరోగ్యం వరకు అన్నింటిలోనూ ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఫైబర్ ఎందుకు ముఖ్యం..?
నిజానికి ఫైబర్‌ను శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరిచే 'క్లీనింగ్ సిస్టమ్' అని పిలుస్తారు. ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచి, ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలోనూ దీని పాత్ర అనన్యసామాన్యం. పెద్దలకు ప్రతిరోజూ సుమారు 25 నుంచి 35 గ్రాముల ఫైబర్ అవసరం. కానీ మనం తీసుకునే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఇది నామమాత్రంగా కూడా ఉండటం లేదు. దీనివల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు మొదలవుతున్నాయని డైటీషియన్లు చెబుతున్నారు.
మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..?
జీర్ణక్రియ మందగించడం వల్ల మలవిసర్జన కష్టమ వుతుంది. ఇది ఫైబర్ లోపానికి ప్రాథమిక సంకేతం. కడుపులో భారంగా అనిపించడం, గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం తరచూ వేధిస్తుంటాయి. పీచు పదార్థం తక్కువగా ఉంటే ఆహారం త్వరగా జీర్ణమై, రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఫైబర్ లోపం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి, గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉంటుంది. పేగులలో ఉండే మంచి బ్యాక్టీరియా బలహీనపడటం వల్ల తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది.
ఖర్చు లేకుండానే ఫైబర్..!
పీచుపదార్థం కోసం ఖరీదైన సప్లిమెంట్లు అక్కర్లేదు. మన నిత్యం వాడే ఆహార పదార్థాలతోనే దీనిని పొందవచ్చు. ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ, జొన్నలు వంటివి ఆహారంలో భాగంగా చేసుకోవాలి.ఆపిల్, జామ, బొప్పాయి, క్యారెట్, బీట్‌రూట్, ఆకుకూరల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
పండ్ల రసాల కంటే పండ్లను నేరుగా తినడమే మేలు. చిక్కుడుకాయలు, శనగలు, కందిపప్పు, చియా గింజలు పీచుకు అద్భుతమైన మూలాలు.పీచు పదార్థం తీసుకున్నప్పుడు అది సరిగ్గా పనిచేయాలంటే శరీరంలో తగినంత నీరు ఉండాలి. కాబట్టి రోజువారీగా పుష్కలంగా నీరు తాగడం మర్చిపోవద్దు. నేడే మీ డైట్ ప్లాన్‌ను మార్చుకోండి.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి..!
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com