యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు ప్రధాన కారణాలు..  

షేర్ చేయండి:
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు ప్రధాన కారణాలు..  

సాక్షి లైఫ్ : గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు లేకపోవడం, అవగాహన లేమి, శానిటరీ న్యాప్‌కిన్లు అందుబాటులో లేకపోవడం వంటి అనేక కారణాలతో మహిళలు తరచూ శానిటరీ న్యాప్‌కిన్‌లను ఉపయోగించలేకపోతున్నారు. ఈ విషయంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, దాదాపు 50 శాతం మంది మహిళలు బహిష్టు సమయంలో దుస్తులను ఉపయోగిస్తున్నారు. ఇది ఏమాత్రంసురక్షితం కాదు. వాళ్ల ఆరోగ్యానికి హానికరం. రుతుక్రమం విషయంలో సరైన అవగాహనా లేకపోవడంతో అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. 

  ఇది కూడా చదవండి.. రుతుక్రమం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?  

తీవ్రమైన వ్యాధులు..

పరిశుభ్రత లేకపోతే గర్భాశయ క్యాన్సర్, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటి అత్యంత తీవ్రమైన వ్యాధులు కూడారావచ్చు. ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది బాలికలు బడి మానేస్తున్నారు. ఎందుకంటే పరిశుభ్రత సాధనాలు లేక, అంతేకాదు టాయిలెట్లు, శానిటరీ నాప్‌కిన్‌లు లేకపోవడం కూడా ఇందుకు కారణం.

రుతుక్రమ సమస్యలు..

దేశంలోని వైద్యనిపుణులు రుతుక్రమ సమస్యలపై శ్రద్ధ చూపడంతో గత కొన్నేళ్లుగా భారతదేశంలో అనేక మార్పులు వచ్చాయి. అయితే ఈ దిశలో మెరుగుదల సంతృప్తికరంగా లేదు. ఇప్పటికీ, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక ప్రచారాలు, భారతదేశంలోని నగరాలు, గ్రామాలలోని నిరుపేద మహిళలకు ఉచిత శానిటరీ నాప్‌కిన్ పంపిణీ వంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

 ఇది కూడా చదవండి.. హార్ట్ హెల్త్ కోసం బెస్ట్ ఫుడ్ 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.