Crying Club Trend : కన్నీటితో ఆరోగ్యం..పెరుగుతున్న 'క్రైయింగ్ క్లబ్‌' ట్రెండ్..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత తరంలో ఉరుకుల పరుగుల జీవితంతోపాటు పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భావోద్వేగాలను అణచివేస్తూ రోబోల్లా మారుతున్న తరుణంలో.. భారతీయులు ఇప్పుడు సరికొత్త 'వెల్‌నెస్' బాట పడుతున్నారు. అదే 'క్రైయింగ్ క్లబ్' (Crying Club). మనసులోని బాధను కన్నీటి రూపంలో బయటకు పంపి, ప్రశాంతత పొందేలా చేసే ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రాచుర్యం పొందుతోంది.

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

 

'రుయికట్సు' అంటే ఏమిటి..?

ఈ భావన జపాన్ నుంచి పుట్టుకొచ్చింది. జపాన్‌లో దీనిని 'రుయికట్సు' (Ruikatsu) అని పిలుస్తారు. అంటే 'కన్నీళ్ల కోసం వెతకడం' అని అర్థం. 2013లో హిరోకీ తెరాయ్ అనే వ్యక్తి దీనిని ప్రారంభించారు. ఉద్దేశపూర్వకంగా ఏడవడం వల్ల మనసులోని భారం తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన గుర్తించారు.

క్లబ్‌లో ఏం జరుగుతుంది..?

నగరాల్లోని క్రైయింగ్ క్లబ్‌లు ఒక సురక్షితమైన ఆశ్రయాల వంటివి.
ప్రశాంతమైన సంగీతం, వెచ్చని పానీయాలు, కావాల్సినన్ని టిష్యూ పేపర్లు సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ ఎవరూ మిమ్మల్ని తక్కువ చేసి చూడరు. సలహాలు ఇవ్వరు, ఓదార్పు పేరుతో ఆపమని చెప్పరు.
కొన్ని చోట్ల బాధాకరమైన సినిమాలు చూపించడం లేదా భావోద్వేగపూరిత కథలు చదవడం ద్వారా కన్నీళ్లు వచ్చేలా చేస్తారు.

ఏడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? 

ఏడవడం అనేది బలహీనత కాదు.. అదొక గొప్ప చికిత్స అని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కన్నీళ్ల ద్వారా శరీరంలోని ఒత్తిడి హార్మోన్లు బయటకు వెళ్లిపోతాయి. ఏడ్చిన తర్వాత శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్లు వంటి 'ఫీల్ గుడ్' కెమికల్స్ విడుదలై మనసు తేలికపడుతుంది. అందరితో కలిసి భావోద్వేగాలను పంచుకోవడం వల్ల ఒంటరితనం దూరమై, ఒక రకమైన భరోసా లభిస్తుంది.

మారుతున్న సామాజిక దృక్పథం.. 

మన సమాజంలో 'మగవారు ఏడవకూడదు' అని, 'ఆడవారు రహస్యంగా ఏడవాలి' అని కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. కానీ ఈ క్రైయింగ్ క్లబ్‌లు అలాంటి అడ్డంకులను తొలగిస్తున్నాయి. భావోద్వేగాలను దాచుకోవడం కంటే, వాటిని ప్రదర్శించడమే అసలైన ధైర్యమని ఈ క్రైయింగ్ క్లబ్‌ ల ట్రెండ్ నిరూపిస్తోంది. వేగంగా పరిగెత్తే ఈ ప్రపంచంలో.. కాసేపు ఆగి, మనసు విప్పి ఏడవడం కూడా ఆరోగ్యానికి అవసరమేనని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.