Higher Risk of Heart Attack : కిడ్నీ రోగుల్లో గుండెపోటు ముప్పునకు అసలు కారణం ఇదే..!

షేర్ చేయండి:
Higher Risk of Heart Attack : కిడ్నీ రోగుల్లో గుండెపోటు ముప్పునకు అసలు కారణం ఇదే..!

సాక్షి లైఫ్ : మూత్రపిండాల (Kidneys) సమస్యతో బాధపడే వారిలో సగం మందికి పైగా గుండె సంబంధిత వ్యాధులతోనే ప్రాణాలు కోల్పోతుంటారు. అసలు కిడ్నీలు దెబ్బతింటే గుండె ఎందుకు ఆగిపోతుంది..? ఈ రెండింటికీ ఉన్న సంబంధం ఏమిటి..? అనే ప్రశ్నలకు శాస్త్రవేత్తలు ఎట్టకేలకూ సమాధానం కనుగొన్నారు. కిడ్నీలు విడుదల చేసే కొన్ని 'విషపూరిత కణాలు' గుండెను నేరుగా దెబ్బతీస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

విషపూరిత 'కణాలు' (Tiny Particles)..  

మూత్రపిండాల వ్యాధి ముదిరినప్పుడు, అవి రక్తాన్ని శుద్ధి చేయడంలో విఫలమవుతాయి. ఈ క్రమంలో దెబ్బతిన్న కిడ్నీల నుంచి అత్యంత సూక్ష్మమైన కణాలు (Extracellular Vesicles) విడుదలవుతాయని పరిశోధకులు గుర్తించారు. ఇవి రక్తప్రవాహం ద్వారా నేరుగా గుండె కణజాలానికి చేరుకుంటాయి.

గుండెపై దాడి ఇలా..

కిడ్నీల నుంచి వచ్చే ఈ సూక్ష్మ కణాలు గుండెకు చేరుకున్నాక, అక్కడ కణాల పనితీరును మందగించేలా చేస్తాయి. దీనివల్ల గుండె కండరాలు బలహీనపడటం జరుగుతుంది. అప్పుడు కండరాలు గట్టిపడి, రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం తగ్గుతుంది.

వాపు (Inflammation)..గుండె కణజాలంలో తీవ్రమైన వాపు ఏర్పడి అది గుండెపోటుకు దారితీస్తుంది. గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులు (Arrhythmias) ఏర్పడి ప్రాణాంతకంగా మారుతాయి.

కొత్త చికిత్సలకు మార్గం.. 

ఇప్పటివరకు కిడ్నీ రోగులకు ఇచ్చే సాధారణ గుండె మందులు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. అయితే, కిడ్నీల నుంచి విడుదలయ్యే ఈ విషపూరిత కణాలను అడ్డుకోగలిగితే, కిడ్నీ రోగుల్లో గుండె జబ్బుల మరణాలను తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కేవలం నెఫ్రాలజిస్టులనే కాకుండా, క్రమం తప్పకుండా కార్డియాలజిస్టులను సంప్రదించడం వల్ల ముందస్తు ప్రమాదాలను నివారించవచ్చు. 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.