Medicines Made from Deadly Plants : ప్రాణాలు తీసే మొక్కలతో.. ఆయువుపోసే మందులు..!

షేర్ చేయండి:
Medicines Made from Deadly Plants : ప్రాణాలు తీసే మొక్కలతో.. ఆయువుపోసే మందులు..!

సాక్షి లైఫ్ : మనకు ప్రకృతిలో కనిపించే ప్రతి మొక్క ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుంది. కొన్ని మొక్కలు ముట్టుకుంటేనే ప్రమాదం, మరికొన్ని మొక్కలు తింటే ప్రాణాంతకమైనవి ఉన్నాయి. విశేషమే మిటంటే..? ఆధునిక వైద్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన మందులు ఈ విషపూరితమైన మొక్కల నుంచే తయారవుతున్నాయి. క్యాన్సర్ నివారణకు వాడే 'టాక్సాల్' నుంచి, గుండె జబ్బులను నయం చేసే 'డిగోక్సిన్' వరకు అన్నీ ప్రాణాంతకమైన చెట్ల నుంచి తయారు చేసిన ఉత్పత్తులే అని విషయం మీకు తెలుసా..!

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!

 

అతితక్కువ మోతాదు.. అద్భుతమైన ఫలితాలు..

సాధారణ మూలికా వైద్యం సురక్షితమని చాలామంది భావిస్తారు. అయితే, బ్రిటన్‌లోని 'మెడిసిన్ యాక్ట్ - షెడ్యూల్ 20' పరిధిలోకి వచ్చే కొన్ని మొక్కలు అత్యంత శక్తివంతమైనవి. ఇవి తక్కువ మోతాదులో వాడితే అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయి, కానీ కాస్త మోతాదు పెరిగినా ప్రాణాలు తీస్తాయి. అటువంటి 10 మొక్కలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

1. ఆటం క్రోకస్ (వైల్డ్ శాఫ్రన్) Wild Saffron..  

ఈ మొక్కను ఈజిప్టు కాలం నుంచే నొప్పి నివారణకు వాడుతున్నారు. ఇందులో ఉండే 'కోల్చిసిన్' అనే పదార్థం కీళ్లవాతం (Gouty arthritis) చికిత్సలో కీలకంగా పనిచేస్తుంది.

2. డెడ్లీ నైట్‌షేడ్ (Atropa belladonna)..

ఇది అత్యంత విషపూరితమైనది. కానీ ఇందులోని ఆల్కలాయిడ్లు జీర్ణకోశ సమస్యలు, పార్కిన్సన్స్ వ్యాధి, ఆస్తమా చికిత్సలో అద్భుతంగా పనిచేస్తాయి.

3. గ్రేటర్ సెలెండైన్.. 

అడవుల్లో పెరిగే ఈ మొక్క పచ్చకామెర్లు, బ్రోన్కైటిస్ నివారణకు ఐరోపా జానపద వైద్యంలో ప్రాచుర్యం పొందింది. అయితే ఇది కాలేయంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి.

4. వైట్ క్వెబ్రాకో (White Quebracho).. 

దక్షిణ అమెరికాకు చెందిన ఈ చెట్టు బెరడును జ్వరం, మలేరియా, శ్వాసకోశ ఇబ్బందుల నివారణకు ఉపయోగిస్తారు.

5. క్వినైన్ చెట్టు (Fever Tree).. 

ప్రపంచవ్యాప్తంగా మలేరియాను జయించడానికి వాడే 'క్వినైన్' ఈ చెట్టు బెరడు నుంచే లభిస్తుంది. ఇది బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.

6. ఉమ్మెత్త (Thorn Apple).. 

పురాతన కాలం నుంచి గాయాలు, వాపుల నివారణకు వాడే ఈ మొక్కలో మూర్ఛ వ్యాధిని (Epilepsy) తగ్గించే గుణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

7. ఎఫెడ్రా (Ephedra sinica).. 

చైనా వైద్యంలో 5వేల ఏళ్ల నాటి చరిత్ర దీనికి ఉంది. జలుబు, శ్వాస సంబంధిత మందుల్లో వాడే 'ఎఫెడ్రిన్' దీని నుంచే వస్తుంది. అయితే దీనివల్ల అనారోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉండటంతో పలు దేశాల్లో దీనిపై ఆంక్షలు ఉన్నాయి.

8. హెన్‌బేన్స్ (Henbanes).. 

నైట్‌షేడ్ కుటుంబానికి చెందిన ఈ మొక్క యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. మధుమేహం, క్యాన్సర్ నివారణలో దీని పాత్రపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.

9. ఫెజెంట్స్ ఐ (Pheasant’s Eye).. 

హృదయ స్పందన రేటును క్రమబద్ధీకరించడానికి ఈ మొక్కను ఐరోపా, ఆసియా దేశాల్లో వాడుతుంటారు. ఇందులోని రసాయనాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

10. లిల్లీ ఆఫ్ ది వ్యాలీ.. 

చూడటానికి అందంగా ఉండే ఈ మొక్క పెరటిలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది చాలా విషపూరితమైనది. గుండె వైఫల్యం, యాంజినా వంటి సమస్యలకు మందుల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. ఈ మొక్కలు నేరుగా తీసుకుంటే ప్రాణాంతకం. కాబట్టి వైద్యుల సలహా లేకుండా వీటిని ఔషధాలకు బదులుగా వీటిని తీసుకోకూడదు.

 

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?  

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.