మైగ్రేన్‌ను ఇలా నివారించవచ్చు..

సాక్షి లైఫ్ : మైగ్రేన్‌ ను జీవనశైలి మార్పులు, పలు జాగ్రత్తలు పాటించడం ద్వారా తగ్గించు కోవచ్చు. మీకు మైగ్రేన్ సమస్య ఉంటే, మైగ్రేన్ నొప్పి ప్రారంభమయ్యే ముందు కొన్ని లక్షణాలు మీరు గమనించాలి. మీరు ఆ లక్షణాల ను గుర్తించిన వెంటనే అందుకు కారణమయ్యే వాటికి దూరంగా ఉండాలి. 

మైగ్రేన్ ను ప్రేరేపించే కారకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నిశ్శబ్ద ప్రదేశంలో ఎక్కువ లైటింగ్ , పెద్ద పెద్ద ధ్వనులకు దూరంగా నిద్రించడం మేలు. మీరు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. మీ ఆహారంలో సీజనల్ కూరగాయలు, పండ్లు, ధాన్యాలు మొదలైనవాటిని చేర్చుకోండి. అదనపు ఉప్పు, చక్కెర ,ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.తగినంత నీరు తీసుకోవాలి. క్రమం తప్పకుండా సమయానికి ఆహారం తినండి. తినే విషయంలో ఆలస్యం చేయవద్దు. 

తగినంత నిద్ర అవసరం. ప్రతిరోజూ 7-8 ప్రశాంతంగా నిద్రపోవాలి.ఒత్తిడిని నిర్వహించడానికి మెళుకువలను పాటించాలి. అందుకోసం ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు మొదలైన వాటి ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.  

రోజూ కొంత సమయం పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాతే మందులు తీసుకోండి. ఇవన్నీ చేయగలిగితే సులభంగా మైగ్రేన్ బాధ నుంచి బయటపడగలుగుతారు.

ఇది కూడా చదవండి.. ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : migraine-pain
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com