ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రోస్టేట్ క్యాన్సర్ అనేక సందర్భాల్లో, కణజాల నమూనాలలో హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్ పీవీ ) ఉన్నట్లు కనుగొన్నాయి పరిశోధనలు. ఐతే ప్రోస్టేట్ క్యాన్సర్,హెచ్ పీవీ మధ్య సంబంధానికి సంబంధించి మరింత అధ్యయనం అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి. వాటిని ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2024

ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు.. ?

వేగంగా బరువు తగ్గడం 
 ఎక్కువసార్లు మూత్ర విసర్జన 
మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంట
నొప్పి లేదా లైంగిక సంపర్కంలో అసమర్థత
మూత్రం లేదా వీర్యంలో రక్తం
మలం లేదా మూత్ర విసర్జన చేయలేకపోవడం
తుంటిలో నొప్పి.. 

ప్రమాద కారకాలు..?

వయస్సు: పెరుగుతున్న వయస్సుతో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. సాధారణంగా, 50 సంవత్సరాల వయస్సు తర్వాత, దాని ప్రమాదం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు పరిశోధకులు.  

ఊబకాయం: ఊబకాయం ఉన్న పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఊబకాయం ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పును పెంచుతుంది.

జన్యుశాస్త్రం- జన్యుపరమైన కారణాల వల్ల కొంతమందిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వారి కుటుంబంలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారు ఉంటే మిగిలినవారికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండామరికొన్ని కారణాల వల్ల కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

ఎలా నిరోధించవచ్చు..?

బరువును నిర్వహించండి: అధిక బరువు ప్రొస్టేట్ క్యాన్సర్‌కు ప్రమాద కారకం. కాబట్టి ఆరోగ్యకరమైన బరువును తగ్గించడానికి ప్రయత్నించండి.
ఆరోగ్యకరమైన ఆహారం- మీ ఆహారంలో అన్ని రకాల పండ్లు,  కూరగాయలను చేర్చుకోండి. వీటిలో ఉండే పోషకాలు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

ధూమపానం చేయవద్దు: ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అందుచేత ధూమపానం చేయవద్దు.వ్యాయామం: వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అందువల్ల, ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయండి. స్క్రీనింగ్ చేయించుకోండి: మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత, రెగ్యులర్ ప్రోస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం.  

ఇది కూడా చదవండి.. వాల్‌నట్స్ ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.